ETV Bharat / bharat

గుజరాత్​ స్థానికంలో కాంగ్రెస్ ఓటమి.. రాష్ట్ర పార్టీ చీఫ్​ రాజీనామా - కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షుడు రాజీనామా

గుజరాత్​ స్థానిక పోరులో కాంగ్రెస్​కు పరాభవం తప్పలేదు. ఓటమిపాలైన వారిలో ఓ ఎమ్మెల్యే, ఏడుగురు సిట్టింగ్​ ఎమ్మెల్యేల కుమారులు ఉండటం గమనార్హం. యాదృచ్ఛికంగా సిట్టింగ్​ ఎమ్మెల్యేలు, నేతల బంధువులకు భాజపా టికెట్లు ఇవ్వకపోవటం విశేషం. మరోవైపు.. ఓటమికి బాధ్యత వహిస్తూ.. కాంగ్రెస్​ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అమిత్​ చావ్​డా రాజీనామా చేశారు.

Guj local bodies polls
గుజరాత్​ స్థానిక పోరులో కాంగ్రెస్​కు పరాభవం
author img

By

Published : Mar 2, 2021, 8:07 PM IST

గుజరాత్​ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్​ పార్టీ ఘోరంగా విఫలమైంది. పార్టీ అంచనాలు తారుమారు అయ్యాయి. ఓటమిపాలైన వారిలో ఓ సిట్టింగ్​ ఎమ్మెల్యే సహా.. ఏడుగురు శాసనసభ సభ్యుల కుమారులూ ఉండటం పార్టీ నేతలకు మింగుడుపడటం లేదు. 81 మున్సిపాలిటీలు, 31 జిల్లా పంచాయతీలు, 231 తాలూకా పంచాయతీల ఎన్నికల ఫలితాల్లో భాజపా జోరు చూపించింది.

సిట్టింగ్​ ఎమ్మెల్యే, ఆయన కుమారుడూ..

కాంగ్రెస్​కు ప్రధాన దెబ్బ.. ఆనంద్​ జిల్లాలోని పెట్లాద్​ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన నీరంజన్​ పటేల్​ ఓటమే. పెట్లాద్​ మున్సిపాలిటీలోని వార్డు నంబర్​ 2, 5ల్లో ఓడిపోయారు. ఆయనతో పాటు ఆయన కుమారుడు సౌరభ్​ పటేల్​ కూడా అదే మున్సిపాలిటీలో భాజపా అభ్యర్థిపై ఓడిపోవటం గమనార్హం.

మిగతా సిట్టింగ్​ ఎమ్మెల్యేల కుమారులు వీరే..

  • ఆనంద్​ జిల్లా సోజిత్రా నియోజకవర్గ ఎమ్మెల్యే పూనంభాయ్​ పర్మార్​ కుమారుడు విజయ్​ పర్మార్​.. తారాపుర్​ తాలుకా పంచాయత్​లోని మోరజ్​ సీటులో భాజపా అభ్యర్థిపై ఓడిపోయారు. ఆయన మేనల్లుడు నికుంజ్​ పర్మార్​ సైతం ఈ ఎన్నికల బరిలో నిలిచారు.
  • ఖేద్​బ్రహ్మా కాంగ్రెస్​ ఎమ్మెల్యే అశ్విన్​ కొత్వాల్​ కుమారుడు యాష్​ కొత్వాల్​.. గిరిజనల ప్రాబల్య విజయ్​నగర్​ తాలుగా పంచాయత్​లోని ఛితారియాలో ఓటమి చెందారు.
  • భిలోడా కాంగ్రెస్​ ఎమ్మెల్యే అనిల్​ జోషియారా కుమారుడు కేవల్​.. భిలోడా తాలూకా పంచాయత్​లో ఓడిపోయారు.
  • గిర్​ సోమ్​నాథ్​ జిల్లా ఉన్నా నియోజకవర్గంలో ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పరేశ్​ వాన్ష్​ కుమారుడు పుంజా వాన్ష్​.. రాజ్​పత్​లో ఓటమిపాలయ్యారు.
  • దేవ్​భూమి ద్వారకాలోని ఖంభాలియా నియోజకవర్గ ఎమ్మెల్యే విక్రమ్​ మాడమ్​ కుమారుడు కరన్​.. జిల్లా పంచాయతీ ఎన్నికల్లో వాద్​తారా స్థానంలో ఓడిపోయారు.
  • గుజరాత్​ కాంగ్రెస్​ మాజీ అధ్యక్షుడు అర్జున్​ మోధ్వాడియా సోదరుడు రామ్​దేవ్​ మోధ్వాడియా.. పోర్​బంద్​ తాలూకా పంచాయతీ ఎన్నికల్లో కిందర్ఖేడా స్థానంలో ఓటమిచెందారు.
  • భారతీయ ట్రైబర్​ పార్టీ (బీటీపీ) ఎమ్మెల్యే ఛౌటు వాసవా కుమారుడు దిలీప్​ వాసవా కూడా భారుచ్​ జిల్లా పంచాయత్​ ఎన్నికల్లో రాజ్​పార్డీ స్థానంలో విఫలమయ్యారు.

యాదృచ్ఛికంగానేనా?

యాదృచ్ఛికంగా.. భాజపా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో సిట్టింగ్​ ఎమ్మెల్యేలు, పార్టీలో కీలక పదవుల్లోని నేతల కుమారులు, బంధువులకు టికెట్లు ఇవ్వకూడదని నిర్ణయించటం గమనార్హం.

కాంగ్రెస్​ రాష్ట్ర అధ్యక్షుడు రాజీనామా

స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అమిత్​ చావ్​డా, సీఎల్పీ నేత పరేశ్​ ధనాని తమ పదవులకు రాజీనామా చేశారు. 'మా అంచనాలకు విరుద్ధంగా స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ప్రజా తీర్పును మేము గౌరవిస్తున్నాం. పార్టీ అధ్యక్షుడిగా ఓటమిని అంగీకరిస్తున్నా. ప్రజల కోసం మా పోరాటం కొనసాగుతుంది.' అని పేర్కొన్నారు ​చావ్​డా.

ఇదీ చూడండి: పాక్ శాంతిమంత్రం- అనూహ్య మార్పులకు ఇదే కారణం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.