మహారాష్ట్ర పుణెలో కరోనా విలయం కొనసాగుతోంది. అంబులెన్సులు, ఆస్పత్రుల్లో పడకలు దొరని పరిస్థితి ఎదురవుతోంది. ఈ క్రమంలో పుణెలోని కొంత మంది ఆటోడ్రైవర్లు.. కొవిడ్ బాధితులకు అండగా ఉండేందుకు ముందుకు వచ్చారు. 'జుగాడ్ అంబులెన్సు' పేరుతో ఆటోలను అంబులెన్సుగా మార్చి సేవలు అందించే కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు.
![auto ambulance](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11745711_333.jpg)
తమ వద్ద ఉన్న మూడు ఆటోల్లో ఆక్సిజన్ సిలిండర్లు కూడా ఏర్పాటు చేసినట్లు.. 'జుగాడ్ అంబులెన్సు' రూపకర్త కేశవ్ క్షీర్సాగర్ తెలిపారు.
"ఈ ఆటోల్లో ఉన్న ఆక్సిజన్ సిలిండర్లు 6-7 గంటలపాటు పని చేస్తాయి. కరోనా బాధితుల కోసం మేం ఓ హెల్ప్‌లైన్ నంబర్‌ను కూడా తీసుకువచ్చాం. రోగులకు ఆక్సిజన్‌ను ఎలా అందించాలో మా ఆటో డ్రైవర్లకు శిక్షణ ఇచ్చాం. కరోనా బారిన పడకుండా ఆటోడ్రైవర్లు తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. మాకు ఓ వైద్యుల బృందం కూడా ఉంది."
-క్షీర్సాగర్, జుగాడ్ అంబులెన్స్ రూపకర్త
![auto ambulance](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11745711_222.jpg)
![auto ambulance](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11745711_111.jpg)
ఆస్పత్రుల్లో పడక లభించకపోవటం వల్ల కరోనా రోగులు ఇబ్బంది పడుతున్నారని క్షీర్సాగర్ అన్నారు. ఇందుకోసమే తాము 3 ఆటోల్లో ఆక్సిజన్ సిలిండర్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
ఇదీ చూడండి: ఆ 10 రాష్ట్రాల్లోనే 72% కరోనా కొత్త కేసులు
ఇదీ చూడండి: గంగానది ఒడ్డున ఇసుకలో మృతదేహాల కలకలం