ETV Bharat / bharat

మండపానికి వెళ్లడం మర్చిపోయిన పెళ్లికొడుకు.. వధువు వెయిటింగ్​.. చివరకు! - బిహార్​లో తాగిన మైకంలో పెళ్లినే మర్చిన వరుడు

ఏకంగా తన పెళ్లి అనే విషయాన్ని మర్చిపోయాడు ఓ వరుడు! ముహుర్త సమయానికి వివాహ మండపానికి వెళ్లకుండా ఆలస్యంగా వెళ్లాడు. అది కూడా మద్యం తాగి మండపానికి చేరుకున్నాడు. అప్పటికే వరుడి కోసం మండపంలో ఎదురుచూస్తున్న వధువు ఏకంగా పెళ్లినే రద్దు చేసుకుంది. ఈ ఘటన ఎక్కడ జరిగిదంటే?

Groom Cancelled Marriage In Bihar Due To Late
వరుడు తాగి వచ్చాడని పెళ్లిని రద్దు చేసిన వధువు
author img

By

Published : Mar 16, 2023, 9:00 PM IST

Updated : Mar 16, 2023, 10:06 PM IST

ఏ వ్యక్తైనా మాములుగా తన పుట్టినరోజు, పెళ్లిరోజును ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాడు. ముఖ్యంగా జీవితంలో ఒక్కసారి జరిగే పెళ్లిని మాత్రం అస్సలు మర్చిపోరు. కానీ, బిహార్​కు చెందిన ఓ యువకుడు మాత్రం మద్యం మత్తులో తన పెళ్లిరోజున మండపానికి వెళ్లడమే మర్చిపోయాడు!
బిహార్​ భాగల్​పూర్​ ప్రాంతానికి చెందిన మియాన్ అనే యువకుడికి సుల్తాన్‌గంజ్ గ్రామానికి చెందిన ఓ అమ్మాయితో పెళ్లిని నిశ్చియించారు కుటుంబ సభ్యులు. ఇందులో భాగంగానే మంగళవారం ఉదయం ముహుర్తాన్ని ఖరారు చేశారు పెద్దలు. ఈ క్రమంలో వరుడు కంటే ముందే వివాహ మండపానికి చేరుకున్న వధువు వరుడి రాకకోసం ఎదురు చూస్తూ ఉంది. ముహుర్త సమయం దాటినా పెళ్లికుమారుడు రాకపోయేసరికి వధువు కుటుంబీకులు ఆందోళన పడ్డారు.

నాకీ పెళ్లి వద్దు బాబోయ్​..
కహల్‌గావ్‌లోని అంతిచాక్ ప్రాంతం నుంచి వరుడు ఊరేగింపు రావాల్సి ఉంది. కానీ అతడు ఊరేగింపుగా రాలేదు. పైగా ఉదయం రావాల్సిన అతడు మధ్యాహ్నం సమయంలో మద్యం సేవించి పెళ్లి మండపానికి వచ్చాడు. అయితే మండపానికి ఘనంగా ఊరేగింపుగా వస్తాడని అనుకున్న అతిథులందరూ, అతడు అవేమి లేకుండా ఏకంగా మద్యం సేవించి పెళ్లి వేదికకు చేరుకున్నాడు. ఇది గమనించిన ఆ వధువు నాకీ పెళ్లి వద్దు బాబోయ్​ అంటూ చెప్పేసింది. పెళ్లికి ముందే వరుడు తన బాధ్యతను విస్మరించాడని ఇక జీవితాంతం తనను ఎలా చూసుకుంటాడని ఆ యువతి ఆందోళన వ్యక్తం చేస్తూ.. పెళ్లికి నిరాకరించింది. దీంతో పెళ్లిపీటల దాక వచ్చిన వివాహం అక్కడితో ఆగిపోయింది.

దీనిపై ఆందోళనకు దిగిన వధువు కుటుంబీకులు వరుడితో వచ్చిన బంధువులను, కుటుంబ సభ్యులను బంధించారు. పెళ్లి నిర్వహణ కోసం ఖర్చు చేసిన మొత్తాన్ని తిరిగి ఇవ్వాల్సిందిగా వరుడి బంధువులను డిమాండ్​ చేశారు. ఈ విషయంపై గ్రామస్థుల సమక్షంలో పంచాయతీ పెట్టాయి ఇరు కుటుంబాలు. ఇద్దరి తరఫు వాదనలు విన్న గ్రామపెద్దలు వరుడితో పెళ్లి ఏర్పాట్లకైన మొత్తం డబ్బును వధువు కుటుంబానికి ఇప్పించారు. దీంతో ఈ గొడవ సద్దుమణిగింది. ఇటీవల బిహార్​ రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతుండడం గమనార్హం.

ముద్దుపెట్టాడని పెళ్లికి నో చెప్పిన వధువు..
పెళ్లిమండపంలో కూర్చున్న వధువు మెడలో మూడుముళ్లు వేసేందుకు సిద్దమయ్యాడు ఓ వరుడు. ఏమైందో తెలీదు కాని ఒక్కసారిగా ఆమెకు ముద్దుపెట్టాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఆ యువతి ఏకంగా పెళ్లినే రద్దు చేసుకుంది. అది కూడా ముఖ్యమంత్రి సామూహిక వివాహాల పథకంలో భాగంగా జరుగుతున్న కార్యక్రమంలోనే ఈ సంఘటన వెలుగు చూసింది. మరి ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందో తెలియాలంటే ఈ లింక్​పై క్లిక్ చేయండి.

ముక్కు చిన్నగా ఉంది.. నాకీ పెళ్లి వద్దు..
మరోవైపు, 'వరుడి ముక్కు చిన్నగా ఉంది. నాకు తను నచ్చలేదు' అంటూ పెళ్లిపీటల వరకు వచ్చిన వివాహాన్ని రద్దు చేసింది ఓ వధువు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని సంభాల్ జిల్లాలో జరిగింది. పూర్తి వివరాల కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

Last Updated : Mar 16, 2023, 10:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.