ETV Bharat / bharat

అప్పగింతల్లో గొడవ.. వధువు కన్యత్వ పరీక్షకు వరుడు డిమాండ్.. కోపంతో..

డీజే స్టెప్పులు, పసందైన భోజనాలు, కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య వారిద్దరి పెళ్లి ఘనంగా జరిగింది. అయితే వధూవరుల మధ్య అప్పగింతల సమయంలో గొడవ చెలరేగింది. దీంతో వధువుకు వరుడు కన్యత్వ పరీక్ష చేయించుకోమని డిమాండ్ చేశాడు. దీంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా షాకయ్యారు.

Groom demands virginity test in bride
వధువుకు కన్యత్వ పరీక్ష కోసం వరుడు డిమాండ్
author img

By

Published : Nov 20, 2022, 9:55 AM IST

బిహార్..​ తూర్పు చంపారణ్​ జిల్లాలోని మోతిహరిలో ఓ విచిత్ర ఘటన జరిగింది. వివాహం తర్వాత వధూవరుల మధ్య గొడవ చెలరేగింది. దీంతో అప్పగింతల సమయంలో వరుడు.. వధువుకు కన్యత్వ పరీక్ష చేయించుకోవాలని డిమాండ్ చేశాడు. దీంతో అక్కడున్నవారందరూ ఒక్కసారిగా షాకయ్యారు. తుర్కౌలియా పోలీస్ స్టేషన్​ పరిధిలో నవంబరు 17న జరిగిందీ ఘటన.

ఇదీ జరిగింది..
మోతిహరికి చెందిన వధూవరులకు నవంబరు 16న ఘనంగా వివాహం జరిగింది. మరుసటి రోజు అప్పగింతల సమయంలో వధువు, వరుడికి మధ్య గొడవ జరిగింది. దీంతో వధువు తల్లిదండ్రులు.. తమ కుమార్తెకు అత్తవారింట్లో ఎలాంటి ఇబ్బంది రాదని పేపర్ మీద రాసి హామీ ఇవ్వాలని కోరారు. దీంతో కోపోద్రిక్తుడిన వరుడు​.. వధువు కన్యత్వ పరీక్ష చేయించుకోవాలని డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో వధువు కుటుంబీకులు.. వరుడి బంధువులను బంధించారు. అనంతరం పోలీసుల చొరవతో రెండు రోజుల తర్వాత వారిని విడుదల చేశారు. అయితే వధువు.. పెళ్లి కుమారుడితో అత్తవారి ఇంటికి వెళ్లకపోవడం గమనార్హం.

.
వరుడు, అతడి కుటుంబ సభ్యులు

కన్యత్వ పరీక్షలకు పెరుగుతున్న డిమాండ్​..
బిహార్ రాజధాని పట్నాలో కన్యత్వ పరీక్ష కోసం సర్జరీ చేయించుకునేెందుకు మహిళలు, యువతులు ఆసక్తి చూపుతున్నారని హిమాన్ష్ రాయ్ అనే వైద్యుడు తెలిపారు. పెళ్లికి ముందే శారీరక సంబంధాలు పెట్టుకున్నవారు కన్యత్వాన్ని పొందడానికి శస్త్రచికిత్సలు చేయించుకోవాలనుకుంటున్నారని ఆయన చెప్పారు. వితంతువులు సైతం కన్యత్వ సర్జరీ చేయించుకునేందుకు ఆసక్తిగా ఉన్నారని హిమాన్ష్ పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.