Grenade attack in srinagar: జమ్ము కశ్మీర్లోని శ్రీనగర్లో ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఓ పౌరుడు చనిపోగా.. మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. నగరంలోని హరి సింగ్ హై ప్రాంతంలో భద్రతా బలగాలే లక్ష్యంగా సాయంత్రం 4.20 ప్రాంతంలో ఈ దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు.
ఈ దాడిలో గాయపడిన వారిలో ఒక పోలీసు సైతం ఉన్నట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను స్థానికంగా ఉన్న శ్రీ మహారాజా హరి సింగ్ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ఆసుపత్రికి చేరుకున్న తరువాత తీవ్రగాయాలతో ఓ వ్యక్తి చనిపోయినట్లు వివరించారు.
మృతుడు నగరంలోని నౌహట్టా ప్రాంతానికి చెందిన మహ్మద్ అస్లాం మఖ్దూమీగా పోలీసులు గుర్తించారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని అదుపులోకి తీసుకున్న బలగాలు.. ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ను ప్రారంభించినట్లు పేర్కొన్నారు.
ఈ దాడిని వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు ఖండించారు.
ఇవీ చూడండి:
ఆర్టీసీ బస్లో మహిళకు లైంగిక వేధింపులు... నిద్రిస్తుండగానే...