ETV Bharat / bharat

గుడిసెకు నిప్పంటించి తాత, నానమ్మను కడతేర్చిన మనవడు - సేలం వార్తలు

'బాబాయ్​ని చూసి నేర్చుకో..' అన్న పాపానికి సొంత తాత, నానమ్మ గుడిసెకు నిప్పంటించాడు పదహారేళ్ల బాలుడు. ఈ ఘటనలో వృద్ధ దంపతులిద్దరూ మృతిచెందారు. ఈ దారుణం తమిళనాడులో జరిగింది.

Grandson murdered his grandparents near Attur
మనవడే చంపేశాడు
author img

By

Published : Sep 15, 2021, 7:53 AM IST

తమిళనాడు సేలం జిల్లా, అత్తూరులో దారుణ ఘటన జరిగింది. బాబాయ్​ని చూసి నేర్చుకోమని చెప్పినందుకు.. ఓ బాలుడు.. తన నానమ్మ, తాతయ్యలను చంపేశాడు.

ఏం జరిగిందంటే..?

సేలం జిల్లా అత్తూరులో కట్టురాజా(75), కసియమ్మల్​(60) దంపతులు నివాసముంటున్నారు. వారికి దేసింగురాజా, మణి, కుమార్​ అనే ముగ్గురు కొడుకులు ఉన్నారు. నిందితుడు.. కుమార్ సంతానంలో ఒకడు.

Grandson murdered his grandparents
మృతిచెందిన వృద్ధ దంపతులు

అయితే.. బాబాయ్​ దేసింగురాజాను చూసి నేర్చుకుని జీవితంలో ఎదగమని నానమ్మ, తాతయ్య.. బాలుడికి సూచించారు. ఈ మాటతో ఆగ్రహం చెందిన బాలుడు.. నానమ్మ, తాతయ్యను చంపేయాలని నిశ్చయించుకున్నాడు. పథకం ప్రకారం.. మంగళవారం తెల్లవారుజామున.. బయటి నుంచి గొళ్లెంపెట్టి.. ఆ దంపతులు ఉంటున్న గుడిసెకు నిప్పంటించాడు. దీంతో కాలిన గాయాలతో వృద్ధ దంపతులు మృతిచెందారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇదీ చదవండి: పడవ బోల్తా పడి నలుగురు మృతి- ఏడుగురు గల్లంతు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.