ETV Bharat / bharat

బుల్లెట్​ ర్యాలీతో అదరగొట్టిన మహిళలు.. కలర్​ఫుల్​ చీరకట్టుతో నృత్యాలు - మహారాష్ట్ర గుడిపడ్వా సంబరాలు

Gudi Padwa 2022: మరాఠీలు నూతన సంవత్సరాన్ని ఘనంగా ఆహ్వానించారు. గత రెండేళ్లుగా కరోనా ఆంక్షలతో సంబరాలకు దూరంగా ఉన్న మహారాష్ట్ర ప్రజలు ఈసారి రెట్టింపు ఉత్సాహంతో పండగను జరుపుకున్నారు. ఢోలు వాయిస్తూ నృత్యాలు చేశారు. రంగురంగుల దుస్తులు ధరించి మహిళలు చేసిన బైక్​ ర్యాలీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

gudi padwa 2022
బైక్​ ర్యాలీ
author img

By

Published : Apr 2, 2022, 1:20 PM IST

గుడిపడ్వా వేడుకలు

Gudi Padwa 2022: మహారాష్ట్రలో గుడిపడ్వా సంబరాలు అంబరాన్నంటాయి. నాగ్​పుర్​, పుణె, ముంబయి, ఠాణె సహా వివిధ నగరాల్లో చిన్నా, పెద్దా అంతా రంగురంగుల దుస్తులు ధరించి వేడుకల్లో పాల్గొన్నారు. సంప్రదాయ చీరకట్టులో ముస్తాబైన మహిళలు బైక్​ ర్యాలీలతో ఆకట్టుకున్నారు. కత్తిసాము, కర్రసాము చేసి సత్తా చాటారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా సంబరాలకు దూరమైన మరాఠీలు ఈసారి రెట్టింపు ఉత్సాహంతో పండగ జరుపుకున్నారు. ముంబయి సహా అనే నగరాల్లోని వీధులు శోభాయాత్రలతో కోలాహలంగా మారాయి.

ముంబయిలోని గిర్​గావ్​ ప్రాంతంలో మహిళలు నిర్వహించిన బైక్​ ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్న ఈ ర్యాలీలో 151 మంది బుల్లెట్​ బండి నడిపి అదరగొట్టారు. పలు ప్రాంతాల్లో మహిళలు చేసిన నృత్యాలు కూడా ఆకట్టుకున్నాయి. మహారాష్ట్రతో పాటు మరికొన్ని రాష్ట్రాలు కూడా శనివారం తమ నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్నాయి. ఉగాది, చేటీ చాంద్​, సాజిబు చెయ్​రోబా మొదలైనవి ఇందులో భాగం.

వివిధ రాష్ట్రాల్లోని నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్​ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. "గుడిపడ్వా, నవ్​రేహి, ఉగాది, చేటీ చాంద్​, సజిబు చెయ్​రోబా జరుపుకుంటున్న ప్రజలకు శుభాకాంక్షలు" అని పేర్కొంటూ వేర్వేరు ట్వీట్లు చేశారు. ఈ పండగ అందరి జీవితాల్లో కొత్త శక్తిని నింపుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి : ఉగాది వేళ వారందరికీ షాక్.. 40 కొత్త ఎన్​ఫీల్డ్​ బైక్స్​ దగ్ధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.