Children vaccine is unscientific: చిన్నారులకు కూడా కొవిడ్ టీకా అందించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఎయిమ్స్ సీనియర్ వైద్యుడు, భారత ప్రజారోగ్య సంఘం (ఐపీహెచ్‌ఏ) అధ్యక్షుడు డాక్టర్ సంజయ్ కె రాయ్ పెదవి విరిచారు. అది అశాస్త్రీయ నిర్ణయమని, దానివల్ల అదనపు ప్రయోజనాలేవీ ఉండబోవని ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. కరోనా సోకకుండా అడ్డుకోవడంలో టీకాలు అంతగా సఫలీకృతం కావడం లేదని ఆయన తెలిపారు.
Children Covid vaccine:
వ్యాధి తీవ్రత, మరణాల ముప్పు పెరగకుండా మాత్రం అవి అద్భుతంగా నిరోధిస్తున్నాయని చెప్పారు. పిల్లల్లో కొవిడ్ తీవ్రత, మరణాలు చాలా తక్కువగా ఉంటున్న సంగతిని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో వారికి టీకా అందించాలన్న నిర్ణయం అశాస్త్రీయమని పేర్కొన్నారు.
దేశంలో 15-18 ఏళ్ల వయసు వారికి జనవరి 3 నుంచి కరోనా వ్యాక్సిన్ అందించనున్నట్లు ప్రధాని మోదీ శనివారం ప్రకటించారు.
ఇదీ చదవండి: 15-18 ఏళ్ల వారికి ప్రస్తుతానికి ఆ వ్యాక్సిన్ మాత్రమే