ETV Bharat / bharat

'విదేశాల్లో ఉద్యోగ ఆఫర్లు'.. గుడ్డిగా నమ్మితే అంతే సంగతి.. కేంద్రం హెచ్చరిక! - Fake jobs in thailand

విదేశాల్లో స్థిరపడాలన్న ఆశతో ఉద్యోగ ప్రయత్నాలు చేసే వ్యక్తులను మోసం చేసేందుకు ఆయా దేశాల్లో ముఠాలు ఏర్పడుతున్నాయి. ఉద్యోగాలిప్పిస్తామని మభ్యపెట్టి తీరా అక్కడికి వెళ్లాక వారిని అక్కడ బందీలుగా చేస్తున్నాయి. ఇలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ శనివారం ప్రకటన జారీ చేసింది.

jobs scam in myanmar and thailand
govt warns against fake jobs
author img

By

Published : Sep 25, 2022, 7:02 AM IST

govt warns against fake jobs : విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామనే వ్యక్తులు, సంస్థల పట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ భారతీయ యువతకు సూచించింది. విదేశాలకు ఉద్యోగాలకు వెళ్లేవారు సంబంధిత దేశానికి చెందిన నియామక సంస్థలు, వ్యక్తుల వివరాలను పరిశీలించి ధ్రువీకరించుకోవాలని స్పష్టం చేసింది. ఉద్యోగాలపై ఆశతో కొందరు భారతీయులు మయన్మార్‌ వెళ్లి అక్కడ మోసపోయిన నేపథ్యంలో నకిలీ జాబ్‌ రాకెట్‌ వలలో చిక్కుకోవద్దని హెచ్చరిస్తూ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ శనివారం ప్రకటన జారీ చేసింది.

"థాయ్‌లాండ్‌లో డిజిటల్‌ సేల్స్‌, మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌, డేటా ఎంట్రీ ఉద్యోగాలు అంటూ కొన్ని ఐటీ సంస్థలు రాకెట్‌ నడిపిస్తున్న ఉదంతాలు ఇటీవల బ్యాంకాక్‌, మయన్మార్‌లలోని భారత దౌత్య కార్యాలయాల దృష్టికి వచ్చాయి. ఆకర్షణీయమైన జీతాలు ఇస్తామంటూ ఐటీ నైపుణ్యాలున్న యువతే లక్ష్యంగా దుబాయ్‌, భారత్‌ ఆధారిత రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీలు సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు ఇస్తున్నాయి. ఆ సంస్థల వలలో చిక్కిన తరువాత అక్రమంగా దేశం దాటిస్తున్నాయి. ఇలా మోసపోయిన బాధితులు అక్కడ బందీలుగా ఉండాల్సి వస్తోంది" అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది.

ఇదీ చదవండి: విషాదం.. వేడి టీలో పడి ఏడాది చిన్నారి మృతి

ప్రిన్సిపల్​పై స్టూడెంట్​ రివెంజ్​.. గన్​తో కాల్పులు జరిపి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.