ప్రముఖ బాలీవుడ్ నటి తాప్సీ పన్ను, దర్శకుడు అనురాగ్ కశ్యప్, ఇతర సినీ ప్రముఖుల ఇంటిపై ఐటీ దాడులను తప్పుపట్టింది సంయుక్త కిసాన్ మోర్చా. రైతులకు మద్దతుగా నిలిచే వారిని హింసించేందుకే ప్రభుత్వం ఈ చర్య చేపట్టిందని ఆరోపించింది.
"ప్రభుత్వం.... రైతుల డిమాండ్లను నెరవేర్చాల్సింది పోయి అన్నదాతలను, వారికి మద్దతుగా నిలిచేవారిని ఒత్తిడికి గురి చేస్తోంది."
-సంయుక్త కిసాన్ మోర్చా.
బుధవారం ఉదయం నుంచి ముంబయి, పుణెలో దాదాపు 30 ఇళ్లలో ఐటీ సోదాలు నిర్వహించింది.