ETV Bharat / bharat

'పీఎం కేర్స్​'​ నిధులతో లక్ష ఆక్సిజన్​ కాన్సంట్రేటర్లు - 'పీఎం కేర్స్​'​ నిధులతో లక్ష ఆక్సిజన్​ కాన్సంట్రేటర్లు

పీఎం కేర్స్​ నిధులతో లక్ష పోర్టబుల్​ ఆక్సిజన్​ కాన్సంట్రేటర్లు, కొత్తగా 500 పీఎస్​ఏ ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆమోదం తెలిపారు. వీటి ద్వారా ఆస్పత్రులో ఆక్సిజన్ సరఫరా పెరుగుతుందని పేర్కొన్నారు.

pm modi
'పీఎం కేర్స్​'​ నిధులతో లక్ష ఆక్సిజన్​ కాన్సంట్రేటర్లు
author img

By

Published : Apr 28, 2021, 5:25 PM IST

దేశవ్యాప్తంగా ఆక్సిజన్​ కొరతను రూపుమాపే చర్యల్లో భాగంగా.. లక్ష పోర్టబుల్ ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అనుమతి ఇచ్చారు. పీఎం కేర్స్ ఫండ్‌ నుంచి వీటికి నిధులను విడుదల చేయనున్నారు. కరోనా కేసులు ఎక్కువున్న రాష్ట్రాలకు ఈ ఆక్సిజన్​ కాన్సన్​ట్రేటర్లను అందించాలని అధికారులను మోదీ ఆదేశించారు.

పీఎం కేర్స్ ఫండ్‌ నుంచి కొత్తగా 500 పీఎస్‌ఏ(ప్రెషర్​ స్వింగ్​ అడాప్షన్​) ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది. గతంలో 713 పీఎస్‌ఏ ప్లాంట్లు మంజూరు చేసినట్లు పేర్కొంది. పీఎస్‌ఏ ప్లాంట్లతో ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ సరఫరా పెరుగుతుందని చెప్పింది.

ఇదీ చూడండి: కొవిడ్​ పోరులో 24x7 సహాయ చర్యలు: ఐఏఎఫ్​

ఇదీ చూడండి: '18 ప్లస్​'కు టీకా రిజిస్ట్రేషన్ షురూ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.