దిల్లీ సరిహద్దుల్లో సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న రైతు సంఘాలు.. అడ్డంకులు తొలగించి, తమతో చర్చలు జరపాలని కేంద్రాన్ని కోరాయి. చర్చలు జరపడానికి తాము ఎప్పడూ అనుకూలంగా ఉంటామని పేర్కొంది సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం).
రైతులు-కేంద్రానికి మధ్య ఇప్పటివరకు 11సార్లు చర్చలు జరిగినప్పటికీ ఫలితం లేకపోయింది. చివరిసారిగా ఈ ఏడాది జనవరి 22న చర్చలు జరిగాయి.. గణతంత్ర దినోత్సం రోజు రైతులు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారడం వల్ల మళ్లీ చర్చలు జరగలేదు.
ఇదీ చూడండి: శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్కు కరోనా