ETV Bharat / bharat

'ఇంట్లో ఉన్నా మాస్క్​ పెట్టుకోవాల్సిన సమయం' - వీకే పాల్​

కొవిడ్ విజృంభిస్తున్న వేళ ప్రజలు అనవసర భయాందోళనలకు గురికావొద్దని కేంద్రం సూచించింది. అర్హులైన ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని, టీకాల పంపిణీని వేగవంతం చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వివరించింది. అవసరం లేకున్నా ఆక్సిజన్‌, ఇతర ఔషధాలను ఇళ్లలో నిల్వ చేసుకోవడం సరికాదని, ఈ చర్యల వల్ల మార్కెట్‌లోనూ వీటి కొరత ఏర్పడుతుందని స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఇళ్లల్లోనూ తప్పనిసరిగా మాస్కు ధరించాలని సూచించింది.

Mask
ఇంట్లోనూ మాస్క్​
author img

By

Published : Apr 26, 2021, 7:51 PM IST

దేశంలో కొవిడ్ రెండో దశ ఉద్ధృతి కొనసాగుతున్న వేళ ప్రజలు అనవసర భయాందోళనలకు లోనుకావొద్దని కేంద్రం సూచించింది. అనవసర భయాలు మంచికంటే చెడు ఎక్కువ కలిగిస్తాయని పేర్కొంది. అర్హులైన ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని, టీకాల పంపిణీని వేగవంతం చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వివరించింది. మహిళలు నెలసరి సమయంలోనూ కొవిడ్ టీకా తీసుకోవచ్చని వెల్లడించింది. భయాందోళనలతో చాలామంది ఆస్పత్రుల్లో చేరుతున్నారన్న కేంద్ర ఆరోగ్యశాఖ.. వైద్యుల సిఫార్సు మేరకే ఆస్పత్రుల్లో చేరాలని సూచించింది. కరోనా సోకినా భయపడాల్సిన అవసరం లేదని పేర్కొంది. భౌతిక దూరం, మాస్కు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని వెల్లడించింది. భౌతికదూరం పాటించని రోగి నుంచి నెలరోజుల్లో 406 మందికి వైరస్‌ విస్తరించే అవకాశముందని తెలిపింది. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఇళ్లల్లోనూ తప్పనిసరిగా మాస్కు ధరించాలని సూచించింది.

Mask
మాస్క్​ ధరించి భౌతిక దూరం పాటించే విధానం

" కొవిడ్ విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో మాస్కు కచ్చితంగా ధరించండి. అత్యవసరం ఐతే తప్ప బయటకు వెళ్లకండి. మీ కుటుంబంతో ఇంట్లోనే ఉండండి. ముఖ్యంగా మీ కుటుంబంతో ఉన్నా మాస్కు ధరించండి. వైరస్ వేగంగా విజృంభిస్తోంది. వ్యాప్తి వేగంగా ఉంది. మీరు బయటకు వెళ్లకండి. వీలైనంతంగా మీరు ఇతరులను ఇంట్లోకి ఆహ్వానించకండి. వైరస్‌ గురించి భయపడకండి. కొందరిలో మాత్రమే ఇది తీవ్రంగా ప్రభావం చూపుతోంది."

- డా.వీకే పాల్‌, నీతి ఆయోగ్‌ సభ్యుడు

కొవిడ్‌-19 స్వల్ప ఇన్‌ఫెక్షన్‌ మాత్రమే..

85 నుంచి 90 శాతం మంది ప్రజలు జలుబు, జ్వరం, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు మాత్రమే ఉంటాయని పేర్కొన్నారు. ఇటువంటి వారు ఇంటి వద్దనే చికిత్స తీసుకుంటే సరిపోతుందని ఆక్సిజన్, రెమ్‌డెసివిర్‌ అవసరం లేదని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా స్పష్టం చేశారు. కేవలం 10 నుంచి 15శాతం రోగులకు మాత్రమే ఆక్సిజన్, రెమ్‌డెసివిర్‌ లేదా ప్లాస్మా అవసరం అవుతుందన్నారు. 5శాతానికి తక్కువ మందికి మాత్రమే వెంటిలేటర్‌ లేదా ఐసీయూ చికిత్స ఇవ్వాల్సి వస్తోందని డాక్టర్‌ గులేరియా పేర్కొన్నారు. రెమ్‌డెసివిర్‌ ఔషధం మ్యాజిక్‌ బుల్లెట్‌ కాదని..కేవలం ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతున్న వారికే ఇది అవసరమవుతుందని రణ్‌దీప్‌ గులేరియా స్పష్టం చేశారు. అనవసర భయాలకు లోనుకాకుండా ఆక్సిజన్‌, రెమ్‌డెసివిర్‌ వంటి ఔషధాలను ఇళ్లలో నిల్వచేసుకోవద్దని స్పష్టం చేశారు.

Mask
లక్షకుపైగా క్రియాశీల కేసులున్న రాష్ట్రాలు

" కొందరు ఎలాంటి ఇబ్బంది, లక్షణాలు లేకున్నా కొవిడ్ పాజిటివ్‌ రాగానే.. తమకు ఆక్సిజన్ అవసరమని భయపడి ఆసుపత్రిలో చేరుతున్నారు. వీరి వల్ల ఆసుపత్రుల్లో రద్దీ నెలకొంది. దీనివల్ల అవసరం ఉన్న వ్యాధిగ్రస్తులు సరైన చికిత్స అందక.. ఇబ్బంది పడుతున్నారు. కొందరు ఆక్సిజన్, రెమ్‌డెసివిర్‌ వంటి ఔషధాలను ఇంట్లో నిల్వ చేసుకోవడం వల్ల మార్కెట్‌లో కొరత ఏర్పడుతోంది. కొవిడ్‌ వస్తే తొలిరోజు నుంచి ఈ ఔషధాలన్నీ వాడాలని కొందరు భావిస్తున్నారు. దాని వల్ల ఉపయోగం ఉండకపోగా.. దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉంది."

- డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా, ఎయిమ్స్‌ డైరెక్టర్‌

రెండో దశతో దేశాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారిని కేవలం కొవిడ్‌ నిబంధనలను పాటించడం, టీకా తీసుకోవడం వల్లే అదుపులోకి తీసుకురావొచ్చని ఎయిమ్స్‌ వైద్య నిపుణులు సూచించారు. వ్యాక్సిన్‌ తీసుకున్న వారు కూడా మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించాలని స్పష్టం చేశారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం కొవిడ్‌ నిర్ధరణ చేసే ల్యాబ్‌లు, వైద్య పరికరాలు, మెడికల్‌ ఆక్సిజన్‌, పలు ఔషధాలతో పాటు వ్యాక్సిన్‌ అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో ప్రజల సహకారంతో వైరస్‌ వ్యాప్తికి త్వరలోనే అడ్డుకట్ట వేయవచ్చని వైద్య నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి: 'దేశంలో సరిపడా ఆక్సిజన్.. కానీ...'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.