ETV Bharat / bharat

ట్రిప్​ పేరుతో బాలికపై స్కూల్​ టీచర్ అత్యాచారం - అత్యాచార ఘటనలు

ట్రిప్​ పేరుతో విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ ఉపాధ్యాయుడు. ఈ ఘటన ఛత్తీస్​గఢ్​లోని రాజ్​నంద్​గావ్​ జిల్లాలో జరిగింది. డిసెంబరు 2న ఈ దుర్ఘటన జరిగనట్లు పోలీసులు వెల్లడించారు.

్
author img

By

Published : Dec 7, 2021, 9:31 PM IST

పదకొండో తరగతి చదువుతున్న బాలికపై ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు అత్యాచారానికి పాల్పడ్డ ఘటన ఛత్తీస్​గఢ్​లోని రాజ్​నంద్​గావ్ జిల్లా​లో చోటుచేసుకుంది. ఈనెల 2న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్​ చేశారు.

పోలీసులు వివరాల ప్రకారం..

డిసెంబరు 2న నిందితుడు ఎడ్యుకేషనల్​ ట్రిప్​కు తీసుకెళ్తానంటూ బాధితురాలిని బలవంతంగా కారులోకి ఎక్కించుకున్నాడు. ఒక నిర్మానుష్య ప్రాంతంలో కారు ఆపి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటకు తెలిస్తే అత్యాచారం చేస్తానని బాధితురాలి అక్కను కూడా బెదిరించాడు. ఈ ఘటన గురించి బాధితురాలి తల్లిదండ్రులకు సోమవారం తెలిసింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్​ చేశారు.

అదే రోజు మరో ఘటన..

రాజస్థాన్​ భిల్​వర జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాల కూడా ఇటువంటి ఘటనే జరిగింది. ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఆ స్కూల్​ టీచర్. డిసెంబరు 2న జరిగిన ఈ ఘటనపై పోక్సో చట్టం పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే టీచర్​ను అరెస్ట్​ చేయాల్సి ఉంది.

ఇదీ చూడండి : చిన్నారిపై అత్యాచారం.. నెలరోజుల్లో 'ఉరి' తీర్పు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.