కరోనాపై పోరులో భాగంగా ప్రాణాలు కోల్పోయిన ఆరోగ్య కార్యకర్తల పిల్లల కోసం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 2020-21 అకాడమిక్ సంవత్సరంలో కేంద్రం కోటాలోని 5 ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లను రిజర్వు చేసింది.
కరోనాపై పోరులో ప్రాణాలు కోల్పోయిన యోధులకు గౌరవ సూచకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ఈ మేరకు ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపులో కేంద్ర కోటా విభాగంలో 'వార్డ్స్ ఆఫ్ కొవిడ్ వారియర్స్' కేటగిరీని ప్రవేశపెట్టారు.
నీట్ ర్యాంకుల ఆధారంగా..
ఇందుకోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన నీట్-2020లో ర్యాంకుల ఆధారంగా వైద్య మండలి కమిటీ (ఎంసీసీ) అభ్యర్థులను ఎంపిక చేస్తుంది.
ఆరోగ్య కార్యకర్తలకు రూ.50 లక్షల బీమా ప్యాకేజీ ప్రకటించిన సమయంలో 'కరోనా యోధులు'గా నిర్వచించిన అందరూ దీనికి అర్హులేనని హర్షవర్ధన్ తెలిపారు.
ఇదీ చూడండి: దేశంలో మరో 45,576 కొవిడ్ కేసులు