రైతులకు కేంద్రం శుభవార్త అందించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆరు రబీ పంటలకు కనీస మద్దతు ధరలను పెంచుతూ మంత్రివర్గం మంగళవారం నిర్ణయం తీసుకుంది. కందుల కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.500 పెంచినట్లు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. గోధుమలపై రూ.110 పెంచగా.. ఆవాలపై రూ.400 పెంచామని వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) పంటలకు కనీస మద్దతు ధరను పెంపు నిర్ణయం తీసుకున్నట్లు అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
పంట | పెంపు | ధర(క్వింటాలుకు) |
గోధుమలు | రూ.110 | రూ.2,125 |
ఆవాలు | రూ.400 | రూ.5,450 |
బార్లీ | రూ.100 | రూ.1,735 |
శనగలు | రూ.105 | రూ.5,335 |
కందులు | రూ.500 | రూ.6,000 |
సన్‌ఫ్లవర్ | రూ.209 | రూ.5,650 |
ఇవీ చదవండి: ఫోన్ కొట్టేశాడన్న అనుమానంతో బాలుడ్ని నూతిలో వేలాడదీసి విచారణ
జయలలిత మృతి కేసులో ట్విస్ట్.. శశికళపై డౌట్స్.. చనిపోయాక 31 గంటల తర్వాత..