కొవిడ్ టీకా పంపిణీని విస్తృతం చేస్తున్న కేంద్రం తాజాగా మరో 1.45 కోట్ల డోసులను కొనుగోలు చేసింది. ఇందులో కొవిషీల్డ్ డోసులు సంఖ్య కోటి, కొవాగ్జిన్ డోసులు సంఖ్య 45 లక్షలుగా ఉన్నాయి. ఈ విషయాన్ని టీకాలు రూపొందించిన సీరం, భారత్ బయోటెక్ సంస్థలు మంగళవారం స్పష్టం చేశాయి.
ఎగుమతి చేసేందుకు సిద్ధం..
పలు టీకాలను బ్రెజిల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలకు ఎగుమతి చేస్తామని భారత్ బయోటెక్ ప్రతినిధి తెలిపారు. ఫిలిప్పీన్స్ సహా పలు దక్షిణాసియా దేశాల్లోనూ వ్యాక్సిన్ పంపిణీ చేసే అవకాశం ఉందన్నారు.
ఇదివరకు కేంద్రం 1.1 కోట్ల కొవిషీల్డ్ డోసులను, 55 లక్షల కొవాగ్జిన్ డోసులను కొనుగోలు చేసింది.
ఇదీ చదవండి : 'ఫేస్బుక్ లైవ్‌తో అధికారుల దృష్టికి జలవిలయం!'