కరోనా వ్యాక్సిన్‌ను డ్రోన్లతో సరఫరా చేసేందుకు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) నిర్ణయించింది. ఇందుకు సంబంధించి డ్రోన్‌ల వినియోగంపై సాధ్యాసాధ్యాలను ఐసీఎంఆర్ అధ్యయనం చేయడానికి పౌర విమానయాన శాఖ గురువారం అనుమతి ఇచ్చింది.
ఐఐటీ కాన్పూర్, ఐసీఎంఆర్ సంయుక్తంగా ఈ అధ్యయనం చేయనున్నాయి. ఇందుకు షరతులతో కూడిన అనుమతులు లభించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ అనుమతులు ఏడాది పాటు అమలులో ఉండనున్నట్లు పేర్కొంది.
ఉద్యోగులు అందరూ టీకా తీసుకోండి
కేంద్ర ప్రభుత్వం 18 ఏళ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్‌ను తీసుకోవడానికి అనుమతి ఇచ్చినందున ఉద్యోగులంతా టీకా తీసుకోవాలని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సూచించింది.
ఇదీ చూడండి: ప్రభుత్వ మార్గాల ద్వారానే టీకా సరఫరా: ఫైజర్