సీరం సంస్థ ప్రతిపాదించిన పోలియో టీకాల ధరపై కేంద్ర ఆరోగ్య శాఖ జోక్యం చేసుకోవాలని ప్రత్యేక కమిటీ విజ్ఞప్తి చేయనుంది. గతేడాది ప్రభుత్వం కొనుగోలు చేసిన టీకా ధర కన్నా ఇది రెట్టింపు ఉండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
ఈ ఏడాది సీరం సరఫరా చేయనున్న 1.8 కోట్ల పోలియో టీకా డోసులలో ఒక్కోదానికి రూ.188 (పన్నుల మినహా) చెల్లించాలని సంస్థ పేర్కొందని అధికారులు మంగళవారం వెల్లడించారు. ఇది గతేడాదితో పోలిస్తే 106.65 శాతం ఎక్కువని తెలిపారు. ఇంతకుముందు సుంకాలు మినహా డోసును రూ.91కే కొనుగోలు చేశామని స్పష్టం చేశారు.
సీరం స్పందన..
సీరం తొలిసారి ఈ టెండర్లో పాల్గొందని.. తాము సరైన ధరనే ప్రతిపాదించామని సంస్థ భావిస్తున్నట్టు సమాచారం. ప్రతిపాదిత ధర యూనిసెఫ్ సూచించిన ధర కన్నా తక్కువేనని ఆ సంస్థ ప్రతినిధి పేర్కొన్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి : భారత్ బయోటెక్ ప్లాంట్‌కు కేంద్ర భద్రత