దేశంలో రెండో దశ కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్డౌన్ విధిస్తారనే అనుమానాలకు తెరదించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. కరోనా కట్టడి చేసేందుకు ప్రభుత్వం పూర్తిస్థాయి లాక్డౌన్ విధించబోదని.. అయితే ఎక్కడికక్కడ కంటైన్మెంట్ జోన్లను మాత్రమే నిర్వహిస్తుందని పేర్కొన్నారు. ప్రపంచబ్యాంకు గ్రుప్ ప్రేసిడెంట్ డేవిడ్ మల్పాస్తో వీడియో సమావేశం సందర్భంగా ఆమె ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
ఈ క్రమంలో దేశ అభివృద్ధికి ఆర్థిక లభ్యతను పెంచేందుకు.. రుణ సాయాన్ని విస్తరించడానికి ప్రపంచ బ్యాంకు చేపట్టిన చర్యలను సీతారామన్ ప్రశంసించారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి భారత్ తీసుకుంటున్న చర్యల గురించి ఆర్థికమంత్రి వివరించారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్.. వ్యాక్సిన్ సహా కఠిన నిబంధన అనే ఐదు స్తంభాల వ్యూహాన్ని భారత్ అనుసరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది.
ఇదీ చూడండి: మారుతీ కార్లలో బెస్ట్ సెల్లర్స్ ఇవే...