షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారు ఫిర్యాదులు చేయడానికి కేంద్రం ప్రభుత్వం బుధవారం ఓ పోర్టల్‌ను ప్రారంభించింది. ఈ ఫిర్యాదు పరిష్కార పోర్టల్‌ను జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ అభివృద్ధి చేసింది. భారత రాజ్యాంగ సృష్టికర్త డా. బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్.. ఈ పోర్టల్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. దేశ నిర్మాణంలో అంబేడ్కర్ కృషిని గుర్తుచేసుకున్నారు. దేశ పురోగతి రాజ్యాంగబద్ధంగా ఉండాలని అంబేడ్కర్ సూచించినట్లు తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ ఇండియా పథకంలో భాగంగా ఈ పోర్టల్‌ను ఆవిష్కరించినట్లు పేర్కొన్నారు.
'ఈ పోర్టల్‌తో షెడ్యూల్ కులాలకు చెందిన వారు ఫిర్యాదులను నమోదు చేయవచ్చు. ఇందుకుగాను వారికి ఓ గుర్తింపు పత్రం వస్తుంది. ప్రతి ఫిర్యాదుకు ప్రత్యేకమైన సంఖ్య ఉంటుంది. దాని ద్వారా నోడల్ ఆఫీసర్ ఫిర్యాదుల పరిష్కారానికి కృషి చేస్తారు' అని ఓ అధికారి వివరించారు.
ఇదీ చూడండి: బాబాసాహెబ్‌కు మోదీ, రాహుల్ నివాళి