ETV Bharat / bharat

'కార్పొరేట్లకు ప్రభుత్వ ఆస్తులు ధారాదత్తం!' - 2021-22 Union Budget news updates

రోగమొకటైతే మందొకటి అన్నచందంగా బడ్జెట్​ ఉందని విపక్షాలు విమర్శించాయి. దేశాన్ని అమ్మేయడమే లక్ష్యంగా బడ్జెట్​లో కేటాయింపులు ఉన్నాయని ఆరోపించాయి. ఇది పూర్తిగా దూరదృష్టి లేని బడ్జెట్​ అని మండిపడ్డాయి. మరోవైపు 2021-22 పద్దును స్వాగతించారు భాజపా నేతలు.

Govt handing over India's assets to crony capitalists: Rahul Gandhi on Union Budget
'పెట్టుబడిదారులకు దేశ ఆస్తుల దారాదత్తం'
author img

By

Published : Feb 1, 2021, 4:42 PM IST

Updated : Feb 1, 2021, 6:24 PM IST

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. సోమవారం పార్లమెంట్​లో ప్రవేశపెట్టిన బడ్జెట్​పై విపక్షాలు పెదవి విరిచాయి. కేటాయింపులపై అసంతృప్తిని వ్యక్తం చేశాయి. వ్యాధి ఒకటైతే చికిత్స మరొకటి అన్న చందంగా ఉందని కాంగ్రెస్​ విమర్శలు ఎక్కుపెట్టింది. క్షీణిస్తున్న జీడీపీని గాలికొదిలేశారని ఆరోపించారు.

బడ్జెట్​తో పేదలకు అండగా నిలవాల్సిన మోదీ సర్కార్​.. ప్రభుత్వ ఆస్తులను తన పెట్టుబడిదారి మిత్రులకు కట్టబెట్టేలా కేటాయింపులు చేసినట్లు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్ గాంధీ. రైతులు, కార్మికులు, ఎంఎస్​ఎంఈలకు ఊతమందించాలని డిమాండ్​ చేశారు. రక్షణ రంగానికి చేసిన కేటాయింపులపై అసంతృప్తి వ్యక్తం చేశారు రాహుల్​.

క్లిష్ట పరిస్థితుల్లో గొప్ప బడ్జెట్​ను ప్రవేశపెడతారని భావించామని కాంగ్రెస్ లోక్​సభాపక్షనేత అధీర్ రంజన్​ చౌధురీ అన్నారు. అయితే అస్పష్టమైన చర్యలతో సాధారణ బడ్జెట్​ను ప్రవేశపెట్టారన్నారు.

"కొన్ని రాష్ట్రాల్లో రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్​ను రూపొందించారు. ధనాన్ని ఖర్చు చేస్తామన్నారు. పేదలకు ఊతమిచ్చేలా బడ్జెట్​ ఉంటుందని భావించాం. కానీ అది జరగలేదు. పెట్టుబడులు ఉపసంహరణ, ప్రవేటీకరణ వంటి చర్యలతో.. ప్రభుత్వం దేశాన్ని అమ్మకానికి పెట్టింది."

- అధీర్​ రంజన్​ చౌధురీ, కాంగ్రెస్ లోక్​సభాపక్ష నేత

'మేకపోతు గాంభీర్యం'

"ఆర్థిక మంత్రి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించారు. దేశానికి పారదర్శక బడ్జెట్​ అవసరం. బలహీన వర్గాలకు నేరుగా సాయమందిస్తే.. ఉద్యోగ అవకాశాలు మెరుగయ్యేవి" అని కాంగ్రెస్ సీనియర్​ నేత ఆనందద్​ శర్మ అన్నారు. వినియోగదారుడి డిమాండ్​ను పునరుద్ధరించి.. వృద్ధికి ఊతమందించేలా ఎలాంటి ప్రణాళిక లేకపోవడం వల్ల బడ్జెట్​ అసంతృప్తిగా ఉందన్నారు.

ధనార్జన లక్ష్యంగా ప్రవేశపెట్టిన బడ్జెట్​ అని ఆరోపించారు మరో కాంగ్రెస్​ నేత మనీశ్​ తివారీ. నేషనల్ మోనిటైజేషన్​ ప్రణాళిక దేశాన్ని అమ్మేయడానికి ఓ సులభమైన మార్గమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏదేమైనా పద్దుపై కేంద్రం దృష్టిసారించలేదన్నారు.

100శాతం దూరదృష్టి లేని బడ్జెట్​

2021-2022 బడ్జెట్​ పూర్తిగా ముందుచూపులేనిదని, దీని ఉద్దేశం దేశాన్ని అమ్మేయడమేనని విమర్శించించారు టీఎంసీ ప్రతినిధి ఓబ్రెయిన్​ అన్నారు. "సాధారణ ప్రజలను, రైతులను విస్మరించారని.. ఈ పద్దు.. ధనవంతులను ధనవంతులకుగాను, పేదవారిని మరింత పేదవారిని చేస్తుంది. మధ్యతరగతివారికి ఏమి లేదు" అని వ్యాఖ్యానించారు.

నిర్మలా పద్దుపై ప్రశంసలు..

అయితే అధికార పార్టీ నేతలు మాత్రం నిర్మలా పద్దుపై ప్రశంసలు కురిపించారు. ఆత్మనిర్భర్​ భారత్​ లక్ష్యంగా ప్రవేశపెట్టిన బడ్జెట్​.. ఆర్థిక వ్యవస్థకు ఊతమందిస్తుందన్నారు రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్​ అన్నారు.

మూలధనవ్యయం, సీనియర్​ సిటిజన్లకు పన్ను మినహాయింపు, అంకుర సంస్థలకు ప్రోత్సాకాలు అందించడం వంటి ఎన్నో అంశాలపై దృష్టిసారించిందని ప్రశంసించారు. వ్యవసాయం, ఆరోగ్యం, మౌలిక వసతులకు పెద్దపీట వేసినట్లు మరో భాజపా నేత భూపేందర్​ యాదవ్.​

ఇదీ చూడండి: ఎన్నికలు జరిగే 4 రాష్ట్రాలపై వరాల జల్లు

Last Updated : Feb 1, 2021, 6:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.