ETV Bharat / bharat

విదేశీయుల వీసా గడువు పెంపు.. ఎప్పటివరకంటే? - విదేశీయుల వీసా గడువు పెంపు

భారత్​లో ఉన్న విదేశీయుల వీసా గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది కేంద్రం. గడువు ముగిసేంతవరకు సాధారణ వీసా లేదా ఈ-వీసా కలిగిన వారు.. ఎలాంటి ఓవర్ స్టే పెనాల్టీ చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది. అఫ్గాన్ పౌరులకు సైతం.. ఈ గడువు వర్తిస్తుందని తెలిపింది.

visa
వీసా
author img

By

Published : Sep 2, 2021, 9:14 PM IST

కొవిడ్​ కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దై.. స్వదేశానికి వెళ్లలేక పోయిన విదేశీయులకు వీసా గడువు పొడిగించింది భారత ప్రభుత్వం. అంతకుముందు ఆగస్టు 31వరకు ఉన్న గడువును.. ఈ నెల 30 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని రకాల వీసాలకు ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది.

మార్చి, 2021 వరకు వివిధ రకాల వీసాల ద్వారా భారత్​కు వచ్చి కరోనా కారణంగా విమాన సర్వీసులు రద్దై.. భారత్​లోనే చిక్కుకున్న వారికోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత అధికార ప్రతినిధి తెలిపారు. భారత్​లో ఉన్న విదేశీయులకు.. ఎలాంటి ఓవర్​ స్టే పెనాల్టీ విధించకుండా వీసా గడువును పొడిగిస్తున్నామన్నారు.

విదేశీయులు.. ఫారనర్స్ రీజనల్​​ రిజిస్ట్రేషన్​ కార్యాలయాల్లో(ఎఫ్​ఆర్​ఆర్​ఓ) ఎలాంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదన్నారు. ఎవరికైనా సెప్టెంబర్ 30 తర్వాత కూడా.. వీసా గడువు కావాలంటే ఎఫ్​ఆర్​ఆర్​ఓ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

అఫ్గాన్ పౌరులకు కూడా.. ఇదివరకు చెప్పిన విధంగానే గడువును పొడిగిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: Vaccination: 'దేశంలో 50శాతానికిపైగా వయోజనులకు కొవిడ్​ టీకా'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.