ETV Bharat / bharat

కేంద్రం కీలక నిర్ణయం- 'ఒవైసీ'కి జెడ్​ కేటగిరీ భద్రత! - mim

Govt decides to provide 'Z' category security to Asaduddin Owaisi

author img

By

Published : Feb 4, 2022, 11:58 AM IST

Updated : Feb 4, 2022, 1:48 PM IST

11:52 February 04

కేంద్రం కీలక నిర్ణయం- 'ఒవైసీ'కి జెడ్​ కేటగిరీ భద్రత!

ఒవైసీ కారుపై దుండగులు కాల్పులు.. సీసీటీవీ వీడియో

Asaduddin Owaisi News: ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్​ ఎంపీ అసదుద్దీన్​ ఒవైసీకి జెడ్​ కేటగిరీ(సీఆర్​పీఎఫ్​) భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు అధికార వర్గాలు తెలిపాయి. ఉత్తర్​ప్రదేశ్​లో ఎన్నికల ప్రచారం ముగించుకొని దిల్లీకి తిరిగివస్తుండగా.. ఆయన కారుపై గురువారం రోజు కాల్పులు జరిపారు దుండగులు. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Z Category to Asaduddin: సీఆర్​పీఎఫ్​ కమాండోలు 24 గంటలు ఒవైసీ భద్రతను పర్యవేక్షించనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.

గురువారం రోజు హాపుర్​- గాజియాబాద్​ జాతీయ రహదారిపై ఛాజర్సీ టోల్​ప్లాజా వద్ద జరిగిన ఈ దాడిలో ఎవరికీ గాయాలు కాలేదు. అయితే.. ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని ఎన్నికల సంఘాన్ని కోరారు అసదుద్దీన్​.

ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఇద్దరిని అరెస్టు చేసినట్లు హాపుర్​ ఎస్పీ దీపక్​ భుకర్​ తెలిపారు. నిందితులను సచిన్​, శుభంగా గుర్తించారు. ఒవైసీ హిందూ- వ్యతిరేక ప్రకటనలు, వ్యాఖ్యలు.. తమ మనోభావాలను దెబ్బతీశాయని, అందుకే కాల్పులు జరిపినట్లు ప్రాథమిక విచారణలో ఒప్పుకున్నారు. నిందితుల వద్ద పిస్టల్​ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మొత్తం ఐదు బృందాలు.. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నాయని ఏడీజీ ప్రశాంత్​ కుమార్​ తెలిపారు.

ఒవైసీపై నిందితులు కాల్పులు జరిపిన దృశ్యాలు.. సీసీటీవీలో నమోదయ్యాయి. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

ఇదీ జరిగింది..

"యూపీ మేరఠ్​లోని కిథౌర్​లో ఎన్నికల ప్రచారం ముగించుకుని దిల్లీ బయలుదేరాను. ఛాజర్సీ టోల్​గేట్​ వద్ద నా వాహనంపై ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. 3-4 రౌండ్లు తూటాలు దూసుకెళ్లాయి. నా వాహనం టైర్లు పంక్చర్ అయ్యాయి. నేను వేరే వాహనంలో వెళ్లిపోయాను. దాడి చేసేందుకు వచ్చిన వారు మొత్తం ముగ్గురు-నలుగురు ఉన్నారు." అని ఏఎన్​ఐ వార్తా సంస్థతో గురువారం చెప్పారు అసదుద్దీన్.

ఇదీ చూడండి: అసదుద్దీన్​ ఒవైసీ కారుపై దాడి- తుపాకులతో దుండగుల బీభత్సం!

Last Updated : Feb 4, 2022, 1:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.