ETV Bharat / bharat

75వ స్వాతంత్ర్య వేడుకలకు 259 మందితో జాతీయ కమిటీ - narendra modi latest news

75వ స్వాతంత్ర్య వేడుకల నేపథ్యంలో 259 మందితో ఉన్నత స్థాయి జాతీయ కమిటీని ఏర్పాటు చేసింది కేంద్రం. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వం వహించే ఈ కమిటీలో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ, నటులు అమితాబ్‌ బచ్చన్‌, రజనీకాంత్,  దర్శకుడు రాజమౌళి, క్రీడాకారిణిలు పీవీ సింధు, మిథాలి రాజ్​కు చోటు కల్పించింది.

Govt constitutes 259-member panel headed by PM to commemorate 75 years of India's independence
75వ స్వాతంత్ర్య వేడుకలకు 259 మందితో జాతీయ కమిటీ
author img

By

Published : Mar 6, 2021, 5:21 AM IST

2022లో జరగనున్న దేశ 75వ స్వాతంత్ర్య వేడుకల నేపథ్యంలో జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం, మార్గదర్శకాలు అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి జాతీయ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వం వహించే ఈ కమిటీలో 259 మందికి చోటు కల్పించారు. మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్​ఏ బోబ్డే, భాజపా అగ్రనేత ఎల్‌కే ఆడ్వాణీ, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్‌ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. దాదాపు అన్ని రాష్ట్రాల గవర్నర్‌లు, కేంద్ర మంత్రులు, 28 రాష్ట్రాల సీఎంలు, ఇతర పార్టీల నేతలు, వివిధ రంగాల ప్రముఖులకు కూడా కమిటీలో చోటు కల్పించారు.

నటులు అమితాబ్‌ బచ్చన్‌, రజనీకాంత్‌, సంగీత దర్శకులు ఇళయరాజా, ఏఆర్​ రెహ్మాన్‌, గాయని లతా మంగేష్కర్‌,గాయకుడు కేజే ఏసుదాస్ కూడా కమిటీలో సభ్యులుగా ఉన్నారు. తెలుగురాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు చంద్రశేఖర్‌రావు, జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు, ఫార్మా దిగ్గజ సంస్థ భారత్‌ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్లా, దర్శకుడు రాజమౌళి, బ్యాట్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌కు కూడా చోటు దక్కింది.

క్రీడాకారిణిలు పీవీ సింధు, మిథాలి రాజ్‌కు కమిటీలో అవకాశమిచ్చారు. ఈ కమిటీ తక్షణం అమల్లోకి వచ్చినట్లే అని కేంద్రం తెలిపింది. కమిటీ తొలి సమావేశం మార్చి 8న జరగనుంది. కో ఆప్ట్‌ సభ్యులను నియమించుకునే అధికారాన్ని కేంద్రం కమిటీకే అప్పగించింది.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 2022 ఆగస్టు 15తో 75ఏళ్లు కానుండగా... అందుకు సంబంధించిన వేడుకలను 75వారాల ముందే ఈ ఏడాది మార్చి 12న ప్రారంభించాలని కేంద్రప్రభుత్వం ప్రతిపాదించింది. మార్చి 12న జాతిపిత మహాత్మాగాంధీ ఉప్పు సత్యాగ్రహాన్ని ప్రారంభించిన రోజు కావడంతో కేంద్రం ఆ తేదీని ఎంచుకుంది.

ఇదీ చూడండి: 'ఆ లక్ష్యాలను గడువు కంటే ముందే సాధిస్తాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.