ETV Bharat / bharat

'కరోనా టీకాలు అందుబాటులో ఉంచుతాం!'

author img

By

Published : Apr 14, 2021, 11:21 PM IST

రాష్ట్రాలకు రాజ్యాంగ అధిపతులైన గవర్నర్ల పాత్ర.. కరోనా నియంత్రణలో అత్యంత కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కరోనా పోరులో అన్ని సమూహాలు ఏకం కావాలన్నారు. టీకా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

modi gov meet
మోదీ గవర్నర్ల మీటింగ్

కరోనా టీకా డోసులు అందుబాటులో ఉండేలా చూసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఎన్​జీఓలు, రాజకీయ పార్టీలతో పాటు అన్ని సమూహాలు ఏకం కావాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైన మోదీ.. అన్ని సామాజిక సంస్థలు రాష్ట్ర ప్రభుత్వాలతో సహకరించే విధంగా చూడాలని వారికి సూచించారు.

"కరోనా కట్టడికి గతేడాది మాదిరిగా.. ప్రజల భాగస్వామ్యం పెంపొందించాల్సిన అవసరం ఉంది. దీన్ని సాధించడంలో గవర్నర్ల పాత్ర చాలా కీలకం. వేగంగా పది కోట్ల డోసుల పంపిణీ చేసిన దేశంగా భారత్ నిలిచింది. తగినంత టీకా లభ్యత ఉండేలా చూసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. టీకా ఉత్సవ్ కార్యక్రమంలో భాగంగా వ్యాక్సినేషన్ పరిధి, టీకా కేంద్రాల సంఖ్య పెరిగింది."

-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

కరోనా పోరులో గతేడాది సాధించిన అనుభవం దేశానికి ఉందని మోదీ పేర్కొన్నారు. దేశ వైద్య వ్యవస్థ మెరుగైందని చెప్పారు. పీపీఈ కిట్లు, కరోనా టెస్టింగ్ విషయంలో ఆత్మనిర్భరతను సాధించినట్లు వివరించారు.

మెరుగవ్వాలి: వెంకయ్య

ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం పాల్గొన్నారు. కరోనాను ఓడించే విషయంలో రాజకీయ వైరుధ్యాలను పక్కనబెట్టాలని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య పిలుపునిచ్చారు. కరోనా పోరులో.. ఉత్తమ విధానమైన 'టెస్ట్, ట్రాక్, ట్రీట్' విషయంలో మెరుగవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు.

దేశంలో వైద్య వ్యవస్థపై ఒత్తిడి ఉంటుందని చెప్పారు. 85 శాతం కేసులకు కారణమవుతున్న 10 రాష్ట్రాలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని అన్నారు. రాష్ట్రానికి రాజ్యాంధ అధిపతిగా ఉన్న గవర్నర్లు.. కరోనా పోరులో కీలక పాత్ర పోషించాలని అన్నారు. ముఖ్యమంత్రులతో కలిసి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనుభవాలను పంచుకోవడం సహా.. రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శనం అందించాలని పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి: అమల్లోకి జనతా కర్ఫ్యూ-సొంతూళ్లకు కూలీలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.