ETV Bharat / bharat

ఈపీఎఫ్​ వడ్డీ రేటుకు ప్రభుత్వం ఆమోదం.. ఎంతంటే? - ఈపీఎఫ్​ వడ్డీరేటు

EPF Interest Rate: 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్​పై ఉద్యోగులకు 8.1 శాతం వడ్డీ రేటును ఇవ్వడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఈపీఎఫ్​ఓ ఉత్తర్వులు జారీ చేసింది.

EPF Interest Rate
EPF Interest Rate
author img

By

Published : Jun 3, 2022, 6:59 PM IST

Updated : Jun 3, 2022, 8:38 PM IST

EPF Interest Rate: 2021-22 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్‌ వడ్డీరేటు ఖరారైంది. ఈపీఎఫ్‌ జమలపై 8.1శాతం వడ్డీ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈపీఎఫ్​ పై వడ్డీరేటును నాలుగు దశాబ్దాల దిగువకు తగ్గించింది. ఈ మేరకు ఈపీఎఫ్​ సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు మార్చిలో 2021-22 ఆర్థిక సంవత్సరానికి 8.1 శాతం వడ్డీ ఇవ్వాలని ఈపీఎఫ్​ నిర్ణయించింది. తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం కోసం పంపింది. వడ్డీ రేటుకు కేంద్రం ఆమోదం తెలపడం వల్ల ఈపీఎఫ్​ ఖాతాదారులకు వడ్డీని జమ చేయనుంది.

వడ్డీరేటుపై త్వరితగతిన నిర్ణయం తీసుకున్న కేంద్ర కార్మిక, ఆర్థిక శాఖల పనితీరు అభినందనీయమని ఈపీఎఫ్​ఓ ధర్మకర్త కేఈ రఘునాథన్​ తెలిపారు. ఉద్యోగుల పిల్లల చదువులకు, అవసరాలకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. అంతకుముందు 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఈ వడ్డీని ఏడేళ్ల కనిష్ఠానికి తగ్గించి 8.5శాతంగా ఇచ్చారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఇదే వడ్డీ రేటును కొనసాగించారు. 2018-19, 2016-17లో 8.65శాతం చొప్పున వడ్డీ జమ చేయగా.. 2013-14, 2014-15లో 8.75శాతం చొప్పున ఇచ్చారు. 2015-16లో 8.8శాతం చొప్పున జమచేశారు.

ఇదీ చదవండి: ఆమె కడుపులో రూ.3కోట్లు విలువైన డ్రగ్స్.. వారం కష్టపడితే..

Last Updated : Jun 3, 2022, 8:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.