దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో.. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసనలు చేస్తున్న ప్రాంతాల్లో వెంటనే టీకా కేంద్రాలను ఏర్పాటు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) డిమాండ్ చేసింది. వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఉద్యమ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ఎస్కేఎం నేతలు కోరారు.
"రైతులు మాస్కులు ధరించాలి. కొవిడ్-19 నిబంధనలను పాటించాలి. ఎవరైనా రైతులు టీకాలు వేయించుకోవాలనుకుంటే మేము అడ్డుకోం. అది వారి వ్యక్తిగత విషయం."
-- ఎస్కేఎం నేతలు
గతంలో తాము కొవిడ్-19కు భయపడబోమని రైతులు తెలిపారు. ఎట్టిపరిస్థితుల్లోనూ టీకాను తీసుకోబోమని స్పష్టం చేశారు.
కానీ.. కొన్ని రోజులకు భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్ కూడా వ్యాక్సిన్ వేయించుకున్నారు.
ఇదీ చదవండి : 'రాజ్యంగాన్ని కాపాడడంలో దీదీ విఫలం'