ETV Bharat / bharat

'డోసులు లేకపోయినా.. కేంద్రం​ 'టీకా ఉత్సవ్'' - కాంగ్రెస్​ నేత రాహుల్​ విమర్శలు

ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ డోసులు అందుబాటులో లేకపోయినా.. 'టీకా ఉత్సవ్​' పేరుతో కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందని కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ విమర్శించారు. పీఎం కేర్స్​ నిధులు ఏమయ్యాయని ప్రశ్నించారు.

rahul gandhi
కేంద్రంపై రాహుల్​ గాంధీ విమర్శలు
author img

By

Published : Apr 15, 2021, 3:03 PM IST

Updated : Apr 15, 2021, 3:12 PM IST

కరోనా కట్టడి కోసం కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ఆసుపత్రుల్లో వ్యాక్సిన్లు లేకపోయినా.. 'టీకా ఉత్సవ్'​ పేరుతో ప్రజలను ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. పీఎం కేర్స్​​ నిధులు ఏమయ్యాయని ప్రశ్నించారు.

"ఆసుపత్రుల్లో పరీక్షలు జరపట్లేదు, పడకలు లేవు. ఆక్సిజన్​, వెంటిలేటర్ల సదుపాయం లేదు. వ్యాక్సిన్లు కూడా లేవు. కానీ, 'టీకా ఉత్సవ్'​ మాత్రం ఉంది. పీఎం కేర్స్​ నిధులన్నీ ఏమయ్యాయి?"

-రాహుల్​ గాంధీ ట్వీట్

ఏప్రిల్​ 11 నుంచి ఏప్రిల్​ 14 వరకు ప్రభుత్వం 'టీకా ఉత్సవ్​'ను నిర్వహించింది. ఈ నేపథ్యంలో రాహుల్ తాజా వ్యాఖ్యలు చేశారు.

కాగా.. దేశంలో రోజువారీ కరోనా కేసులు ఆందోళనకర స్థాయిలో నమోదవుతున్నాయి. బుధవారం 2,00,739 మందికి వైరస్​ సోకినట్లు తేలింది.

ఇదీ చూడండి: సుప్రీం జడ్జి నివాస సిబ్బంది మొత్తానికి కరోనా

ఇదీ చూడండి: దేశంలో మెడికల్ ఆక్సిజన్​ కొరత లేదు: కేంద్రం

Last Updated : Apr 15, 2021, 3:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.