Central Government Jobs 2023 : డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ చేసి ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్. ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ నాశిక్‌లోని 'ఇండియా సెక్యూరిటీ ప్రెస్' (ఐఎస్పీ) 108 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఉద్యోగాల వివరాలు
Govt ITI Jobs and Diploma Jobs :
- వెల్ఫేర్ ఆఫీసర్ - 1
- జూనియర్ టెక్నీషియన్ (టెక్నికల్) - 41
- జూనియర్ టెక్నీషియన్ (కంట్రోల్) - 41
- జూనియర్ టెక్నీషియన్ (స్టూడియో) - 04
- జూనియర్ టెక్నీషియన్ (స్టోర్) - 04
- జూనియర్ టెక్నీషియన్ (సీఎస్డీ) - 05
- జూనియర్ టెక్నీషియన్ (టర్నర్) - 01
- జూనియర్ టెక్నీషియన్ (గ్రైండర్) - 01
- జూనియర్ టెక్నీషియన్ (వెల్డర్) - 01
- జూనియర్ టెక్నీషియన్ (ఫిట్టర్) - 04
- జూనియర్ టెక్నీషియన్ (ఎలక్ట్రికల్) - 02
- జూనియర్ టెక్నీషియన్ (ఎలక్ట్రానిక్) - 03
- మొత్తం పోస్టులు - 108
విద్యార్హతలు
ISP Nashik Recruitment Eligibility : అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ/ డిప్లొమా/ ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే మరాఠీ భాష కచ్చితంగా తెలిసి ఉండాలి. ఏదైనా సంస్థ లేదా పరిశ్రమలో వెల్ఫేర్ ఆఫీసర్/ పర్సనల్ ఆఫీసర్/ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్‌గా కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.
- జూనియర్ టెక్నీషియన్ పోస్టులకు సంబంధిత విభాగంలో ఫుల్‌టైమ్ డిప్లొమా, ఐటీఐ సర్టిఫికేట్ లేదా ప్రింటింగ్ టెక్నాలజీలో డిప్లొమా ఉండాలి.
వయోపరిమితి
ISP Nashik Recruitment Age Limit : జూనియర్ టెక్నీషియన్ పోస్టులకు.. అభ్యర్థుల వయస్సు 2023 ఆగస్టు 16 నాటికి 18 ఏళ్లు నుంచి 25 ఏళ్లు మధ్యలో ఉండాలి.
- వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు.. అభ్యర్థుల వయస్సు 2023 ఆగస్టు 16 నాటికి 18 ఏళ్లు నుంచి 30 ఏళ్లు మధ్యలో ఉండాలి.
- ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 ఏళ్ల వరకు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.
ఎంపిక విధానం
ISP Nashik Recruitment Selection Process : అభ్యర్థులను మూడు దశల్లో వడపోసి ఎంపిక చేస్తారు. మొదటిగా రాత పరీక్ష నిర్వహిస్తారు. తరువాత స్కిల్ టెస్ట్ చేస్తారు. వీటిలో క్వాలిఫై అయిన అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి, పోస్టులకు ఎంపిక చేస్తారు.
జీతభత్యాలు
ISP Nashik Recruitment Salary జూనియర్ టెక్నీషియన్లకు నిబంధనల ప్రకారం రూ.18,780 నుంచి రూ.67,300 వరకు జీతం ఉంటుంది. వెల్ఫేర్ ఉద్యోగులకు రూ.29,740 నుంచి రూ.1,03,000 వరకు జీతం ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు :
ISP Nashik Recruitment Dates :
- దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 2023 జులై 15
- దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2023 ఆగస్టు 16
- పరీక్ష తేదీలు : 2023 అక్టోబర్/నవంబర్
నోట్ : 1925లో నాశిక్‌లో ఏర్పాటుచేసిన ఇండియన్ సెక్యూరిటీ ప్రెస్‌లో పాస్‌పోర్టులు, ఇతర ప్రయాణ పత్రాలు, పోస్టేజ్ స్టాంపులు, పోస్టు కార్డులు, ఇన్లాండ్ లెటర్లు, ఎన్వలప్‌లు, నాన్-జ్యుడీషియల్, రెవెన్యూ స్టాంపులు ముద్రిస్తారు.