ETV Bharat / bharat

షూటింగ్​లో భారీ అగ్ని ప్రమాదం.. సీరియల్ సెట్ దగ్ధం! - ముంబయి గోరేగావ్​ ఫిల్మ్​సిటీ అగ్ని ప్రమాదం

సీరియల్​ సెట్​లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షూటింగ్ జరుగుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో చుట్టుపక్కల దట్టమైన పొగ కమ్ముకుంది. ఈ ఘటన ముంబయిలోని జరిగింది.

fire Fire breaks out goregaon film city
fire Fire breaks out goregaon film city
author img

By

Published : Mar 10, 2023, 9:59 PM IST

Updated : Mar 10, 2023, 10:13 PM IST

షూటింగ్​లో భారీ అగ్ని ప్రమాదం.. సీరియల్ సెట్ దగ్ధం!

సీరియల్​ సెట్​లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షూటింగ్​ జరుగుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల ధాటికి చుట్టపక్కల ప్రాంతాలలో దట్టమైన పొగ అలుముకుంది. ఈ ఘటన ముంబయిలోని గోరేగావ్​ ఫిల్మ్​ సిటీలో జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాగా, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్‌ తెలిపింది.

ముంబయి గోరేగావ్​ ఫిల్మ్​ సిటీలో "గమ్ హై కిసికే ప్యార్ మే" అనే టీవీ సీరియల్ షూటింగ్​ జరుగుతోంది. సెట్స్​లో శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో అకస్మాత్తుగా భారీ అగ్నిప్రమాదం జరిగింది. షూటింగ్ జరుగుతున్న 2 వేల చదరపు అడుగులు ఉన్న గ్రౌండ్​ ఫ్లోర్​​ స్టూడియోలో మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ ఉన్నవారు ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు సమాచారం అందించారు.

fire Fire breaks out goregaon film city
సీరియల్ సెట్​లో చెలరేగిన మంటలు

ఘటనాస్థలికి 12 ఫైర్ ఇంజన్లు, ఏడు వాటర్ జెట్‌లు, ఒక వాటర్ ట్యాంకర్, మూడు ఆటోమేటిక్ టర్న్-టేబుల్స్, ఒక క్విక్ రెస్పాన్స్ వెహికల్​ను పంపించింది బృహన్ ముంబయి కార్పొరేషన్​. అనంతరం ఈ అగ్ని ప్రమాదాన్ని లెవెల్​-3, లెవెల్​-4 గా అగ్నిమాపక దశం గుర్తించింది. కాగా, ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని కాలేదని ఫిల్మ్​ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ అవినాష్ ధాక్నే తెలిపారు. ప్లైవుడ్​ లాంటి పదార్థాలతో సెట్​ను తయారు చేశారని.. అందుకే మంటలు త్వరగా వ్యాపించాయని ఆయన పేర్కొన్నారు. దీనికి తోడు గాలి బలంగా వేయడం వల్ల మంటలు భారీగా ఎగసిపడ్డాయని చెప్పారు. ఇక, సీరియల్​ నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని.. అందరూ సురక్షితంగా ఉన్నారని నిర్మాణ సంస్థ కాక్రో ఎంటర్​టైన్​మెంట్స్​ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, ఆయేషా సింగ్​, నీల్​ భట్​, ఐశ్వర్య శర్మ ప్రధాన పాత్రలు పోషిస్తున్న సీరియల్​ 'గమ్​ హై కిసీ కే ప్యార్​ మే'. ఇది 2020 అక్టోబర్​లో ప్రారంభమైంది.

fire Fire breaks out goregaon film city
సీరియల్ సెట్​లో చెలరేగిన మంటలు
fire Fire breaks out goregaon film city
ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్​ ఇంజిన్లు

ఆచార్య సెట్​లో చెలరేగిన మంటలు..
అగ్ర నటుడు మెగాస్టార్​ చిరంజీవి సినిమా సెట్​లో ఈ ఏడాది ఫిబ్రవరి 28న అగ్ని ప్రమాదం జరిగింది. 'ఆచార్య' సినిమా కోసం హైదరాబాద్​లోని​ కోకాపేట్​లో వేసిన 'ధర్మస్థలి' అనే సెట్​లో రాత్రి సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన స్థానికులు.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అనంతరం హుటా హుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేశారు. కాగా, ప్రమాదం జరిగిన సమయంలో సెట్​లో ఎవరు లేనందున ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

కాగా, సినిమాలోని ధర్మస్థలి అనే ఊరు కోసం వేసిన ఈ భారీ సెట్​లో.. సినిమాలోని పలు సన్నివేశాలను అక్కడే చిత్రీకరించారు. 'భరత్​ అనే నేను' సినిమాకు పని చేసిన ప్రముఖ ఆర్ట్​ డైరెక్టర్​ సెల్వ రాజన్​ ఈ సెట్​ను డిజైన్​ చేశారు. ఇక, బాలీవుడ్​ స్టార్ హీరో సల్మాన్​ ఖాన్​ సినిమా.. 'కిసీ కా భాయ్​ కిసీ కి జాన్​' లోని పలు సీన్స్​ కూడా ఈ 'ధర్మస్థలి' సెట్​లోనే షూట్​ చేసినట్లు తెలుస్తోంది.

Last Updated : Mar 10, 2023, 10:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.