ETV Bharat / bharat

బ్యాంకు మేనేజర్ చేతివాటం- ఖాతాదారుల పేర్లు మీద లోన్లు, బంధువుల అకౌంట్లలోకి రూ3 కోట్లు - గోపాల్​గంజ్ కో ఆపరేటివ్ బ్యాంకు మేనేజర్ ఫ్రాడ్

Gopalganj Co Operative Bank Manager Fraud : ఖాతాదారుల అకౌంట్ల నుంచి సుమారు రూ.3 కోట్లు తన బంధువుల ఖాతాల్లోకి బదిలీ చేసుకున్నాడు ఓ బ్యాంకు మేనేజర్. బిహార్​లోని గోపాల్​గంజ్ స్టేట్ కోపరేటివ్​ బ్యాంకులో ఈ వ్యవహారం జరిగింది. మేనేజర్​తో పాటు అతడికి సహాకరించిన మరో ఇద్దరిని అధికారులు సస్పెండ్ చేశారు.

Gopalganj Co Operative Bank Manager Fraud

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 2, 2023, 11:02 AM IST

Updated : Nov 2, 2023, 11:49 AM IST

Gopalganj Co Operative Bank Manager Fraud : పని చేస్తున్న బ్యాంకుకే టోకరా వేశాడు బిహార్​లోని గోపాల్​గంజ్ సెంట్రల్ కో- ఆపరేటివ్​ బ్యాంకు మేనేజర్. ఖాతాదారుల అకౌంట్ల నుంచి సుమారు రూ.3 కోట్లు తన బంధువుల ఖాతాల్లోకి బదిలీ చేశాడు. దీంతో అతడిని ఉన్నతాధికారులు సస్పెండ్​ చేశారు. ఈ విషయంలో మేనేజర్​కు సహకరించిన మరో ఇద్దరిపైనా వేటు వేశారు. ఇప్పటి వరకు సుమారు రూ. 85 లక్షలు రికవరీ చేసినట్లు సమాచారం.

వివరాల్లోకి వెళ్తే..
ఏడాది క్రితం రాంబలి ప్రసాద్ అనే వ్యక్తి ఫిక్స్​డ్​ డిపాజిట్​ కోసం ధ్రువపత్రాలను బ్యాంకులో సమర్పించాడు. అప్పుడు బ్యాంకు మేనేజర్​గా ఉన్న చౌదరి రామకాంత్​.. ప్రసాద్ డ్యాకుమెంట్లతో అతని పేరు మీద లోన్​ను మంజూరు చేశాడు. ఆ లోన్​ డబ్బును తన బంధువుల ఖాతాల్లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు. ఇలా ఏడాది వ్యవధిలోనే బ్యాంకు మేనేజర్.. ఐటీ అసిస్టెంట్ సంజయ్​ యాదవ్​, అసిస్టెంట్ సంజీవ్​ కుమార్​ సహాయంతో మొత్తం 67 అకౌంట్ల నుంచి సుమారు రూ.3 కోట్లను వారి సమీప బంధువులకు చెందిన 12 ఖాతాలకు బదిలీ చేసుకున్నాడు.

ఈ విషయం గురించి తెలుసుకున్న బ్యాంకు మేనేజ్​మెంట్ బోర్డు​.. నాబార్డుకు సమాచారం అందించింది. ఈ విషయంపై నాబార్డు.. దర్యాప్తు కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. విచారణలో బ్యాంకు మేనేజర్.. ఇతర ఉద్యోగులతో కలిసి సుమారు రూ.3 కోట్లను ఖాతాదారుల అకౌంట్ల నుంచి తన బంధువుల ఖాతాల్లోకి బదిలీ చేసుకున్నట్లు తెలిసింది. దీంతో బ్యాంకు మేనేజర్​ సహా ముగ్గురిని సస్పెండ్ చేశారు అధికారులు. అలానే వారి దగ్గర నుంచి రూ. 85 లక్షల వరకు రికవరీ చేసినట్లు సమాచారం. ఈ ఫ్రాడ్ గురించి బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ నాబార్డుకు సమాచారం ఇచ్చారు. ఈ విషయంపై పట్నా నాబార్డు ప్రాంతీయ కార్యాలయం దర్యాప్తు జరుపుతోందని డీడీఎం అనుపమ్ లాల్ కుష్మాకర్ తెలిపారు.

"సుమారు రూ.3 కోట్ల అక్రమ లావాదేవీలు జరుగుతున్నట్లు బ్యాంకు ఎండీ సమాచారం ఇచ్చారు. అక్టోబర్ 10న లేఖ ద్వారా తెలియజేశారు. నేను నాబార్డుకు సమాచారం అందించాను. ఈ విషయంపై ఒక కమిటీని ఏర్పాటు చేశాం. ఇంకా దర్యాప్తు పూర్తి కాలేదు. ప్రస్తుతానికి నాబార్డు ఎలాంటి చర్యలు తీసుకోలేదు."
-డాక్టర్ అనుపమ్​ లాల్ కుష్మాకర్, నాబార్డు డీడీఎం

SBI Bank Employee Fraud : బ్యాంక్​ ఉద్యోగే.. దొంగయ్యాడు.. ఖాతాలో రూ.14 లక్షలు మాయం

Jet Airways Owner Arrested : జెట్​ ఎయిర్​వేస్​ ఫౌండర్​ నరేశ్​ గోయల్​ అరెస్ట్.. రూ.538 కోట్ల మనీలాండరింగ్​ కేసులో..

Last Updated : Nov 2, 2023, 11:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.