Goons Attacked On Youth Faridabad: హరియాణా ఫరీదాబాద్‌లో పట్టపగలే కొందరు ఆగంతుకులు రెచ్చిపోయారు. బడ్కల్ చౌక్ ప్రాంతంలో ముగ్గురు దుండగులు.. ఓ వ్యక్తిని తీవ్రంగా కొట్టారు. కారులో వచ్చి యువకుడిపై ఇనుప రాడ్డు, సుత్తితో దారుణంగా దాడి చేశారు. అతడి కాళ్లు, చేతులను విరగ్గొట్టారు. చుట్టుపక్కల జనం ఆపుతున్నప్పటికీ నిందితులు తగ్గలేదు. అనంతరం.. గాల్లో 3 రౌండ్ల కాల్పులు జరిపి పరారయ్యారు.
బాధితుడు ప్రస్తుతం ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఫతేపుర్ చండిలా గ్రామంలో కొందరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే అదే ప్రాంతానికి చెందిన మనీశ్.. చౌక్‌కు వెళ్లగా అతడిని చుట్టుముట్టిన దుండగులు దాడి చేసినట్లు తెలుస్తోంది.
కాసేపటికి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. పాత కక్షల కారణంగానే ఈ ఘర్షణ జరిగిందని వారు చెబుతున్నారు.
ఇదీ చూడండి: ప్రేమ పెళ్లి చేసుకుందని సోదరి హత్య.. తలను వేరు చేసి..