ETV Bharat / bharat

గూగుల్​లో తప్పులు కనిపెట్టిన ఇంజినీర్​కు రూ.66కోట్లు! - indore latest news

Google Bug Hunter: సాఫ్ట్​గా డబ్బు సంపాదించాలంటే.. ఓ కొత్త ప్రోగ్రామ్ కనిపెట్టు.. లేదంటే ఓ కొత్త ప్లాట్​ఫామ్​ క్రియేట్ చేయ్​.. సక్సెస్​ పొందినవారి నుంచి ఇలాంటి మాటలు వింటుంటాం. కానీ మధ్యప్రదేశ్​, ఇందోర్​కు చెందిన అమన్​ పాండేది మాత్రం విభిన్నమైన మార్గం. గూగుల్​లో ఉండే తప్పులను వెతికి రూ.66 కోట్లు గడించాడు. ఎలాగంటారా..? ఓసారి చూసేయండి.

గూగుల్
అమన్ పాండే
author img

By

Published : Feb 18, 2022, 4:48 PM IST

Updated : Feb 18, 2022, 7:08 PM IST

Google Bug Hunter: ప్రస్తుత రోజుల్లో గూగుల్ నిత్య జీవితంలో ఓ సాధనంగా మారింది. ఏది కావాలన్నా దానిని ఆశ్రయిస్తాం. అలాంటి గూగుల్ కొందరిపాలిట వరంగా అయింది. ఎన్నో రకాలుగా డబ్బు సంపాదించే మార్గాలను సూచిస్తోంది. మధ్యప్రదేశ్​ ఇందోర్​కు చెందిన అమన్ పాండేని మాత్రం ఏకంగా కోటీశ్వరుడ్ని చేసేసింది. ఇందుకు అతడు చేసిందల్లా గూగుల్​లో ఉండే తప్పులను ఎత్తిచూపడమే. 300 తప్పులను కనిపెట్టినందుకు గూగుల్ సంస్థ అతనికి రూ.66 కోట్లు ఇచ్చింది.

indore boy found bug in google
అమన్​ పాండే

ఉత్తరాఖండ్​లో జన్మించిన అమన్ పాండే.. భోపాల్ ఎన్​ఐటీలో బీటెక్ పూర్తి చేశాడు. బగ్స్ మిర్రర్ అనే సంస్థను ప్రారంభించాడు. ఒక్క ఏడాదిలోనే గూగుల్​లోని​ 300 తప్పులను ఎత్తిచూపాడు. ఇటీవల ఇందోర్​లో ఆఫీస్​ కూడా ఓపెన్​ చేశాడు. ఇందులో 15 మంది ఉద్యోగులను కూడా నియమించుకున్నాడు. 2021లో గూగుల్​ నుంచి ఓ ప్రాజెక్టు కూడా చేపట్టాడు. రూ.66 కోట్లు అందుకున్నాడు. మరింత సమర్థంగా పనిచేయడానికి, తమ సంస్థను మరింత విస్తరించడానికి ఈ డబ్బును వినియోగిస్తానంటున్నాడు. ఒక్క గూగుల్ మాత్రమే కాదు యాపిల్, సామ్​సంగ్​ కూడా తన క్లయింట్లేనని చెప్పాడు అమన్.

"బగ్స్​పై పనిచేసే ప్రైవేట్ కంపెనీ మాది. 2021లో ప్రారంభించాం. గుర్తు తెలియని వ్యక్తులు డేటాను హ్యాక్ చేస్తే గుర్తిస్తాం. అందుకు సొల్యూషన్ కూడా ఇస్తాం. అంతర్జాతీయ స్థాయిలో మా క్లయింట్ల కోసం పనిచేస్తాం."

-అమన్ పాండే, ఇంజినీర్​

యూజర్ల గోప్యత, భద్రతకు సంబంధించిన అనేక లోపాలు గూగుల్​లో ఉంటాయి. టెక్నికల్ పరిభాషలో వాటిని బగ్స్ అంటారు.

indore boy found bug in google
అమన్ పాండే ఆఫీస్ స్టాఫ్​

ఇదీ చదవండి: కరోనా టీకా​ బూస్టర్​ డోస్​తో 'హెచ్​ఐవీ'? అసలు నిజం ఇదీ...

Last Updated : Feb 18, 2022, 7:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.