ETV Bharat / bharat

అంత్యక్రియలైన వారానికి తిరిగొచ్చిన వ్యక్తి

ఆయనకు అంత్యక్రియలు జరిగి వారం దాటింది. ఇవాళ పోతే రేపటికి రెండు అన్నట్టుగా క్రమక్రమంగా సన్నిహితులు, కుటుంబ సభ్యులు మరిచిపోసాగారు. అయితే చనిపోయారనుకున్న ఆ వ్యక్తి ఓ రోజు హఠాత్తుగా ఇంటికి వచ్చి అందరికీ షాక్​ ఇచ్చారు. ఈ ఘటన రాజస్థాన్​లో జరిగింది.

Dead man, man returns home after his funeral
చనిపోయిన వ్యక్తి
author img

By

Published : May 28, 2021, 6:51 AM IST

ఓ వ్యక్తి మరణించాడనుకుని కుటుంబసభ్యులు అంత్యక్రియలు జరిపారు. అయితే వారం తరువాత ఆ వ్యక్తి సజీవంగా తిరిగి రావడం చూసి వారంతా నిర్ఘాంత పోయిన ఘటన రాజస్థాన్​లో జరిగింది.

రాజసమంద్​ జిల్లాకు చెందిన ఓంకార్​లాల్​ ఈ నెల 11న కుటుంబ సభ్యులకు చెప్పకుండా ఉదయ్​పుర్​ వెళ్లారు. ఆరోగ్యం క్షీణించడం వల్ల అక్కడే ప్రభుత్వాసుపత్రిలో చేరారు. అదే రోజు ఆ ఆసుపత్రిలో చేరిన గోవర్ధన్​ ప్రజాపత్​ అనే వ్యక్తి చికిత్స తీసుకుంటూ మరణించారు. మూడు రోజులైనా గోవర్ధన్​ శవాన్ని ఎవరూ గుర్తించకపోవడం వల్ల ఆసుపత్రి వర్గాలు పోలీసులకు సమాచారం అందించాయి. చనిపోయిన వ్యక్తి ఫొటోలను వివిధ మాధ్యమాల్లో పోలీసులు ప్రచారం చేశారు.

ఇది తెలుసుకుని ఓంకార్​ లాల్ కుటుంబ సభ్యులు మార్చురీ గదికి వచ్చారు. పొరపాటున గోవర్ధన్​నే.. ఓంకార్​గా భావించారు. పోస్టుమార్టం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. శవాన్ని తీసుకుని వెళ్లారు. అదే రోజు అంత్యక్రియలు నిర్వహించారు. అయితే వారం తరువాత ఓం కార్​ తిరిగి వచ్చారు. ​

ఇదీ చూడండి: గర్భిణీని బంధించి.. పిల్లల ముందే అత్యాచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.