విదేశాల నుంచి బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు(Gold Smuggling) కొంతమంది నానా ఎత్తుగడలు వేస్తున్నారు. అయితే.. అధికారుల కూడా అంతే అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా.. విమానంలోని సీటు కింద బంగారాన్ని(Gold Smuggling) దాచి, అక్రమంగా తరలించాలని యత్నించాడు ఓ వ్యక్తి. అయితే.. బెంగళూరు కస్టమ్స్ అధికారులు ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.61 లక్షలుగా ఉంటుందని చెప్పారు.
ఎలా తెలిసింది?
దుబాయ్ నుంచి కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇండిగో విమానం.. గురువారం చేరుకుంది. ప్రయాణికులంతా దిగాక.. విమానాన్ని తనిఖీ చేస్తుండగా ఈ బంగారం బయటపడింది. ఎకానమీ క్లాస్‌లోని ఓ సీటుకు ప్యాకెట్ ఉండడాన్ని అధికారులు గుర్తించారు. అందులో చూస్తే.. పేస్ట్ రూపంలో, 29 స్టిక్స్ రూపంలో 701 గ్రాముల బంగారం బయటపడింది.
దీనిపై కస్టమ్స్ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు(Gold Smuggling) యత్నించిన నిందితుడిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. ప్రయాణికుల జాబితాను అధికారులు పరిశీలిస్తున్నారు.
ఇదీ చూడండి: వానరాలకు విషం పెట్టి హత్య.. ఆపై రోడ్డు పక్కన విసిరేసి..
ఇదీ చూడండి: మాస్క్ లేదని ఫైన్.. అధికారుల్ని చితకబాదిన స్థానికులు