ETV Bharat / bharat

పట్టపగలే మహిళల ఖతర్నాక్ చోరీ- క్షణాల్లో బంగారం బాక్స్​ మాయం

Gold Theft News: మహారాష్ట్ర నాసిక్​ జిల్లా సరాఫ్​ బజార్​లో ముగ్గురు మహిళలు పట్టపగలే బంగారం చోరీ చేశారు. యజమానికి ఉండగానే రూ.4.5 లక్షలు విలువ చేసే బంగారాన్ని కొట్టేశారు. సీసీటీవీ కెమెరా దృశ్యాలు చూశాక యజమానికి చోరీ జరిగిందన్న విషయం తెలిసింది. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

Gold Theft News
బంగారం చోరీ
author img

By

Published : Feb 10, 2022, 4:44 PM IST

యజమాని కళ్లుగప్పి చోరీకి పాల్పడిన మహిళలు

Gold Theft News: బంగారం కొనడానికి అంటూ వచ్చిన ముగ్గురు మహిళలు ఆ దుకాణం యజమాని కళ్లుగప్పి రూ. 4.5 లక్షలు విలువ చేసే బంగారం బాక్స్​ కొట్టేశారు. మహారాష్ట్ర నాసిక్​లో బుధవారం జరిగిందీ ఘటన.

Gold Theft News
చోరీకి పాల్పడుతున్న మహిళలు

ఇదీ జరిగింది..

సరాఫ్ బజార్​లోని ఓ బంగారం దుకాణానికి చిన్న పిల్లతో కలిసి ముగ్గురు మహిళలు వచ్చారు. ఆ నగ చూపించండి, ఈ ఆభరణం ధరెంత అంటూ హడావుడి చేసి.. షాప్ యజమానిని కన్ఫ్యూజ్ చేసేశారు. అప్పుడే ఆయనకు ఫోన్ కాల్ రాగా వారి పని మరింత సులువైంది. పట్టపగలే, షాప్ ఓనర్ ఎదుటే.. రూ.4.5 లక్షల బంగారు ఆభరణం పెట్టెను ఖతర్నాక్​గా కొట్టేసింది ఓ మహిళ. తనతో వచ్చిన చిన్న పిల్లకు ఇచ్చి, బయటకు పంపేసింది. తర్వాత ఎప్పుడో సీసీటీవీ కెమెరా దృశ్యాలు చూశాక చోరీ జరిగిందని యజమానికి అర్థమైంది. ఆయన ఫిర్యాదు మేరకు సర్కార్​వాడా ఠాణా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చూడండి : మంకీ ఫీవర్​ కలకలం- ఆ రాష్ట్రంలో తొలికేసు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.