ఉత్తర్‌ప్రదేశ్‌లోని అదానీ లఖ్‌నవూ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం దుబాయ్ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానంలో బంగారం పెట్టె ఒకటి బయటపడింది. దీంట్లో రూ.కోటి 88 లక్షల విలువైన బంగారు బిస్కెట్లను కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. ఈ బంగారం ఎవరిది అన్న కోణంలో విచారణ చేపట్టింది.
దుబాయ్ నుంచి లఖ్‌నవూకు చేరుకున్న విమానం లోపల ఒక పెట్టెను విమానాశ్రయ సిబ్బంది కనుగొన్నారు. దీనిలో 3.84 గ్రాముల బరువైన 33 బంగారు బిస్కెట్లున్నాయి.
-డిప్యూటీ కమిషనర్ నిహారికా లఖా
స్వాధీనం చేసుకున్న బంగారానికి సంబంధించి ఇంతవరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుల్లో స్మగ్లర్ ఉండొచ్చని.. అయితే కస్టమ్స్ తనిఖీల కారణంగా బంగారాన్ని బయటకు తీయలేకపోయినట్లు భావిస్తున్నారు.
కేరళలో బంగారం పౌడర్..
కేరళ కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ(డీఆర్ఐ) ఉమ్మడిగా నిర్వహించిన ఆపరేషన్‌లో రూ.కోటికి పైగా విలువైన 2.5 కిలోల బంగారం పట్టుబడింది. ఓ ప్రైవేట్ విమానయాన సంస్థ సిబ్బంది నుంచి దీన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. నిందితులను స్థానిక కోర్టులో హాజరుపరిచారు.
రస్-అల్-ఖైమా నుంచి వచ్చిన ఈ విమానంలో పౌడర్ రూపంలో ఉన్న 2.55 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఇవీ చదవండి: రూ.98 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం