కొవిడ్ కట్టడి, టీకా పంపిణీ విషయంలో మోదీ సర్కారు వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 18-45 మధ్య వయస్కుల వారికి ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వకపోవడానికి కారణమేంటని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. మధ్యవర్తుల కారణంగా వాక్సిన్ ధరలకు అదుపు లేకుండా పోయిందని మండిపడ్డారు. పేదలకు వ్యాక్సిన్ ఇవ్వడంపై స్పష్టత ఏదని అన్నారు. కేంద్రానిది వివక్షపూరిత టీకా విధానమని ట్వీట్ చేశారు రాహుల్.
ఎన్నికలపైనే మక్కువా?
ఎన్నికల్లో గెలిచేందుకు చూపిన ఆసక్తి.. కరోనాను కట్టడి చేయడంలో ఎందుకు చూపలేదని ప్రధాని నరేంద్ర మోదీపై ధ్వజమెత్తారు కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్. దేశంలో కొవిడ్ పరిస్థితులు ఉద్ధృతంగా మారుతుంటే మోదీ బాధ్యతారాహిత్యంగా బంగాల్ ఎన్నికల ర్యాలీల్లో పాల్గొంటున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు.
ఇదీ చదవండి:'కరోనా నియంత్రణకు సైన్యం సేవలు విస్తరించాలి'