గోద్రా ప్రత్యేక కార్యదళం సహకారంతో ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు మాజీ సైనికుడిని శుక్రవారం అరెస్టు చేశారు. గుజరాత్‌లోని గోద్రాలో నివసిస్తున్న అనస్ గితేలీ.. భారత సైన్యం వివరాలను పాకిస్థాన్‌కు చేరవేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.
గితేలీని లఖ్‌నవూకు తరలించారు. ప్రాథమిక దర్యాప్తులో అతని ఖాతాలోకి కొంత డబ్బు డిపాజిట్ అయిందని వెల్లడైంది. గతేడాది సెప్టెంబరులో అనస్ గితేలీ సోదరుడు ఇమ్రాన్ గితేలీను (జాతీయ భద్రతా సంస్థ) ఎన్ఐఏ అరెస్టు చేసింది. నేవీ రహస్యాలను పాక్‌కు చేరవేసేందుకు యత్నించడమే కారణం.
ఇదీ చూడండి : టీకా రవాణాలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి