Goa Trip Plan Necessary Things : దేశంలోని అత్యద్భుతమైన పర్యాటక ప్రదేశాల్లో గోవా (Goa) ఒకటి. ఇక్కడికి నిత్యం దేశ నలుమూలల నుంచే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పర్యటకులు వస్తుంటారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో బీచ్‌లు ఉండటంతో యువత కావాల్సినంత ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది. అందుకే వీలు దొరికినప్పుడల్లా అక్కడికే వెళ్లాలని చాలా మంది అనుకుంటారు. మీరు కూడా మీ స్నేహితులతో కలిసి, గోవా వెళ్లాలనుకుంటున్నారా ? అయితే ఈ స్టోరీ మీ కోసమే. గోవాకు వెళ్లి అయ్యో నేను ఈ వస్తువులను మర్చిపోయానే ? ఇప్పుడు ఎలా ? అనే ప్రశ్నలు రాకుడదంటే ఈ కథనం చదివి గోవాకు తీసుకెళ్లాల్సిన వస్తువుల లిస్ట్ చూడాల్సిందే.
గోవాకు తీసుకెళ్లాల్సిన వస్తువులు..
మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు తీసుకెళ్లాల్సిన కొన్ని కామన్ ఐటమ్స్‌ను ఇప్పుడు చూద్దాం.
- మిర్రర్డ్ సన్ గ్లాసెస్ : గోవా ట్రిప్ కోసం తీసుకెళ్లాల్సిన వాటిలో అత్యంత ముఖ్యమైంది.
- సన్‌స్క్రీన్ : మీరు బయట ఎక్కువ సేపు ఎండకు ఉన్నప్పుడు మీ చర్మ సౌందర్యాన్ని రక్షించడంలో ఇది సహయపడుతుంది.
- స్విమ్ వేర్ : మీరు బీచ్‌లో ఎంజాయ్ చేయాలనుకుంటే స్విమ్ బట్టలను మీ వెంట తీసుకెళ్లండి. ఇది మీకు సౌకర్యవంతంగా ఉంటుంది.
- టోపీ, గొడుగు : ఎండ వేడి నుంచి మిమ్మల్ని రక్షించడానికి టోపీ, గొడుగు చాలా ఉపయోగపడతాయి.
- ఇయర్ హెడ్ ఫోన్లు/ హెడ్ ఫోన్లు : మీ వెకేషన్ టైమ్‌లో ఆహ్లాదకరమైన సంగీతం వినడం కోసం ఇయర్ హెడ్ ఫోన్లు/ హెడ్ ఫోన్లు మర్చిపోకండి.
- తేలికపాటి జాకెట్/ హూడీ/ : బీచ్‌లో ఎంజాయ్ చేసిన తరవాత, సరదాగా ఎక్కడికైనా బయటకు వెళ్లినప్పుడు ఫోటోలు తీసుకోవడానికి జాకెట్, లేదా హూడీలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
- మాస్క్ : కొవిడ్ వచ్చిన సమయంలో మాస్క్‌లు చాలా మంది ధరించారు. ఇది మీకు ఎక్కడైనా ఉపయోగపడవచ్చు, మీ వెంట తీసుకెళ్లండి.
- సానిటైజర్ : మీరు ఏదైనా రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు చేతులు శుభ్రం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.
- ప్రథమ చికిత్స కిట్ : మీరు ఎక్కడికి వెళ్లినా కచ్చితంగా ఫస్ట్ ఎయిడ్ కిట్‌ను క్యారీ చేయండి. ఎందుకంటే మీకు, మీ స్నేహితులకు అత్యవసర సమయంలో ఉపయోగపడుతుంది.
- డ్రైవింగ్ లైసెన్స్ (ఒరిజినల్)/ ఇతర ID ప్రూఫ్ : మీరు బైక్/కారు అద్దెకు తీసుకోవాలనుకుంటే ? కచ్చితంగా వీటిని వెంట తీసుకెళ్లండి.
- టీకా సర్టిఫికేట్ : గోవాలో కొన్ని సంస్థలు పూర్తిగా కొవిడ్ టీకాలను వేసుకున్న వారిని మాత్రమే అనుమతి ఇస్తున్నాయి. కాబట్టి, టీకా సర్టిఫికేట్‌లు ఉంటే వెంట తీసుకెళ్లండి.
- మందులు : మీకు అత్యవసరంగా ఉన్నవి తీసుకెళ్లండి.
- లిప్ బామ్ : బీచ్‌లో వీచే గాలి ఉప్పుగా ఉంటుంది. లిప్ బామ్ మీ పెదవులకు రాసుకుంటే గాలికి పగిలిపోవు.
- ట్రావెల్ టవల్ : బీచ్‌లో ఆటలాడిన తరవాత తుడుచుకునేందుకు ఒక పొడి టవల్‌ను మీ వెంట తీసుకెళ్లండి.
- తక్కువ బరువుండే చెప్పులు : మీరు బీచ్‌లో అలా నడుచుకుంటు వెళ్లినప్పుడు ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి.
- డ్రై బ్యాగ్ : మీ విలువైన వస్తువులు నీటిలో తడిసి పాడవకుండా ఉండటానికి డ్రై బ్యాగ్ అవసరం.
- లాండ్రీ బ్యాగ్ : మీరు ఉతకని బట్టలను మంచి వాటి నుంచి వేరు చేయడానికి ఇది ఉపయోగపడుతుంది.
- వాటర్ ప్రూఫ్ సెల్‌ఫోన్ పర్సు : మీరు ఎక్కువ సేపు బీచ్‌లో ఉన్నప్పుడు మీ ఫోన్ పాడవకుండా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది.
- బ్లూ టూత్ స్పీకర్ : బీచ్‌లో సరదాగా సేద తీరుతున్నప్పుడు చక్కటి సంగీతం వినడం కోసం బ్లూ టూత్ స్పీకర్ ఉపయోగపడుతుంది.
- మడతపెట్టగల బ్యాక్‌ప్యాక్ : స్నేహితులతో కలిసి బయటకు వెళ్లెటప్పుడు ఫోల్డబుల్ బ్యాక్‌ప్యాక్ సౌకర్యవంతంగా ఉంటుంది.
మహిళలు మీ గోవా ప్యాకింగ్ లిస్ట్‌లో వీటిన చేర్చుకోండి :
- సౌకర్యవంతమైన కాటన్ దుస్తులు : వేడిని తట్టుకునే శక్తి కాటన్ దుస్తులకు ఉంటుంది. కాబట్టి, కాటన్ వస్త్రాలకు ప్రాధాన్యం ఇవ్వండి. ట్యాంక్ టాప్స్/ కాటన్ టీ-షర్టులు, షార్ట్స్/ స్కర్ట్స్, ఒక జత జీన్స్, ఒక సరోంగ్/ బీచ్-కవరింగ్ వస్త్రాలను తీసుకెళ్లండి.
- పాదరక్షలు : మీకు సౌకర్యవంతంగా ఉండేవి. ఒకవేళ మీరు హైకింగ్‌కు వెళ్లాలనుకుంటే స్పోర్ట్స్ షూని కూడా తీసుకెళ్లండి.
- షాంపూ, కండీషనర్, మాయిశ్చరైజర్, సానిటరీ పాడ్స్.
పురుషుల కోసం :
- ఒక జత జీన్స్, బీచ్ షర్ట్స్
- డ్రెస్ షూస్, స్పోర్ట్స్ షూలను తీసుకెళ్లండి.
- షేవింగ్ కిట్, షాంపూ, కండీషనర్, మాయిశ్చరైజర్
గోవా బీచ్‌లో సచిన్ సందడి.. మత్స్యకారులతో కలిసి చేపలు పడుతూ..