ETV Bharat / bharat

మూడు రాష్ట్రాల్లో ప్రశాంతంగా పోలింగ్.. గోవాలో భారీగా ఓటింగ్

గోవా, ఉత్తరాఖండ్​, ఉత్తర్​ప్రదేశ్​ రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. గోవాలో రికార్డు స్థాయిలో 75.29 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికలసంఘం అధికారులు తెలిపారు. ఉత్తరాఖండ్​లో 59.37 శాతం పోలింగ్ నమోదైంది.

polling
ఓటింగ్
author img

By

Published : Feb 14, 2022, 6:03 PM IST

Updated : Feb 14, 2022, 7:19 PM IST

గోవా, ఉత్తరాఖండ్​ శాసనసభ ఎన్నికలతోపాటు ఉత్తర్​ప్రదేశ్​ రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. గోవాలో 40స్థానాలకు ఓటింగ్ జరగగా సాయంత్రం ఐదు గంటల వరకు 75.29 శాతం పోలింగ్ నమోదైంది. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్​ సావంత్​.. కోతంబిలోని పోలింగ్​ బూత్​లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయాన్ని పోలింగ్​ కేంద్రానికి చేరుకున్న.. గోవా గవర్నర్​ పీఎస్​ శ్రీధరన్​ పిళ్లై, ఆయన భార్య రీతా శ్రీధరన్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలైగోవా అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్​ బూత్​లో ఓటు వేశారు.

goa polls
ఓటు వేసిన గోవా గవర్నర్ దంపతులు
Goa polls
గోవాలో ఓటు హక్కు వినియోగించుకున్న యువతి
Goa polls
గోవాలో ఓటు హక్కు వినియోగించుకున్న యువత

ఉత్తరాఖండ్​ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్​ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు 59.37 శాతం నమోదైంది. గోవా, ఉత్తరాఖండ్​లో చలిని సైతం లెక్కచేయకుండా ఓటు వేసేందుకు పోలింగ్​ బూత్​లకు తరలివచ్చారు ప్రజలు. ఉత్తరాఖండ్​లో తొలిసారిగా మహిళల కోసం ప్రత్యేకంగా 101 పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేశారు అధికారులు.

ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన సీఎం..

ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ దామి, ఆయన సతీమణి గీత ఖతిమాలోని ఓ పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే, ఆ సమయంలో వీరు కాషాయ కండువాలను ధరించడం చర్చనీయాంశంగా మారింది. ఆ కండువాలపై భాజపా గుర్తు కమలం పువ్వు కూడా ఉంది. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి సీఎం దంపతులు భాజపా కండువాలు ధరించి ఓటు వేయడంపై విమర్శలు వస్తున్నాయి. అంతేగాక, ఓటు వేసిన అనంతరం సీఎం సతీమణి పోలింగ్‌ కేంద్రం వద్ద ప్రచారం చేస్తూ కనిపించారు.

uttarakhand polls
ఓటు వేసిన ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్​ సింగ్ ధామి దంపతులు
up polls
క్యూలో నిలబడి ఓటు వేసేందుకు సిద్ధమైన కేంద్రమంత్రి ముక్తార్​ అబ్బాస్​ నఖ్వీ

ఇక ఉత్తర్​ప్రదేశ్ రెండో దశలో ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. సాయంత్రం ఐదు గంటల వరకు 60.44 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. 9 జిల్లాల్లోని 55 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ పూర్తయింది.

యూపీలో కేంద్రమంత్రి ముక్తార్​ అబ్బాస్​ నఖ్వీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్​ స్టేషన్​కు వచ్చిన ఆయన.. సామాన్యుడిలా క్యూలో నిలుచున్నారు. రాంపుర్​లోని పోలింగ్​ బూత్​లో ఆయన ఓటు వేశారు.

uttarakhand polls
ఉత్తరాఖండ్​లో ఓటు హక్కు వినియోగించుకున్న యువత

యూపీలో మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. మూడోదశ పోలింగ్ ఫిబ్రవరి 20, నాలుగోదశ ఫిబ్రవరి 23, ఐదో దశ ఫిబ్రవరి 27, ఆరోదశ మార్చి 3, ఏడోదశ మార్చి 7న జరగనున్నాయి. మార్చి 10న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

ఇవీ చూడండి:

'అత్యధిక బ్యాంకు మోసాలు మోదీ హయాంలోనే '

'కాంగ్రెస్‌ను ఫినిష్ చేయడానికి.. రాహుల్‌, ప్రియాంక చాలు!'

Last Updated : Feb 14, 2022, 7:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.