ETV Bharat / bharat

'ఆ రైతు నాయకుడి హత్యకు అంతర్జాతీయ కుట్ర' - ఖలిస్థానీ ఉగ్రవాద సంస్థ

దిల్లీ సరిహద్దుల్లో నిరసన చేస్తున్న ఓ రైతు నాయకుడిని హత్య చేసేందుకు అంతర్జాతీయ కుట్ర జరిగిందని కేంద్ర నిఘా సంస్థలు ఓ నివేదికలో పేర్కొన్నాయి. దీని వెనుక ఖలిస్థాన్​ కమాండో ఫోర్స్​(కేసీఎఫ్​) ఉందని తెలిపాయి.

Global conspiracy hatched by Khalistan Commando Force to eliminate a farmer leader
'ఆ రైతు నాయకుడి హత్యకు అంతర్జాతీయ కుట్ర'
author img

By

Published : Feb 17, 2021, 5:11 PM IST

దిల్లీ సరిహద్దుల్లో నిరసనలు చేస్తున్న రైతులను ఛిన్నాభిన్నం చేయడానికి ఖలిస్థాన్​ కమాండో ఫోర్స్​(కేసీఎఫ్​) కుట్ర పన్నిందని కేంద్ర నిఘా సంస్థలు పసిగట్టాయి. ఓ రైతు నాయకుడిని హత్య చేసేందుకు ఈ ఉగ్ర సంస్థ ప్రణాళికలు రచించిందని నివేదికలో పేర్కొన్నాయి. దీనిపై అంతర్జాతీయ కుట్రే జరిగిందని తెలిపాయి.

బెల్జియం, యూకేకు చెందిన కుట్రదారులు.. దిల్లీలో నిరసనలు చేస్తున్న ఓ రైతు నాయకుడిని చంపాలని చూస్తున్నారని వెల్లడించాయి నిఘా సంస్థలు. పంజాబ్​లో.. గతంలో కేసీఎఫ్​కు చెందిన దుండగుల్ని అంతమొందించడంలో ఆ రైతు నాయకుడి పాత్ర ఉందన్న కారణంతోనే అతడిని లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొన్నాయి.

ఇదీ చూడండి: 'టూల్​కిట్​'లో ఐఎస్ఐ, ఖలిస్థాన్ మద్దతుదారుడి హస్తం!

ఇదే సరైన తరుణం..

ఆ రైతు నేతను చంపేందుకు ఇదే సరైన తరుణమని భావించి ఉంటారని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో.. రైతు నాయకుడిని చంపితే భారత్​లో హింస పెరిగిపోయి, ప్రభుత్వ సంస్థలు, రాజకీయ పార్టీలపై ఒత్తిడి పెరుగుతుందని కేసీఎఫ్​ దురాలోచనకు పాల్పడినట్లు ఆయన అభిప్రాయపడ్డారు.

కేసీఎఫ్​.. భారత్​లో ఎన్నో దురాఘతాలకు పాల్పడింది. ఈ ఉగ్రవాద సంస్థలో కెనడా, యూకే, బెల్జియం, పాకిస్థాన్​కు చెందినవారు ఉన్నారు.

ఈ రైతు నిరసనలను తమకు అనుకూలంగా మలుచుకొని.. ఖలిస్థానీ వేర్పాటువాద సంస్థలు పుంజుకోవాలని చూస్తున్నాయి. గణతంత్ర దినోత్సవం రోజు ఎర్ర కోట వద్ద జరిగిన హింసాత్మక అల్లర్లలో.. వీరి పాత్ర ఉన్నట్లు అనుమానాలు నెలకొన్నాయి. ఆ రోజు పలువురు ఖలిస్థానీ జెండాలు చేతబట్టి, వారి అనుకూల నినాదాలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఇదీ చూడండి: ఖలిస్థానీ జెండా ఎగురవేసిన ఆరుగురు అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.