Girl Stabbed In Delhi : దేశ రాజధాని దిల్లీలో యువతిపై ఓ యువకుడు.. కత్తితో పలుమార్లు దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితి విషమించడం వల్ల ట్రామా సెంటర్లో చికిత్స పొందుతోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు.. ఇంటర్వ్యూ వెళ్తుండగా లాడో సరాయ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. తాను బుక్ చేసుకున్న క్యాబ్‌లో ఎక్కి బాధితురాలు కూర్చుంది. కాసేపటి తర్వాత నిందితుడు.. క్యాబ్‌ను ఆపి అందులో ఎక్కాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకోమని బలవంతం చేశాడు. అందుకు ఆమె అంగీకరించకపోవడం వల్ల పదునైన కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనను చూసిన క్యాబ్ డ్రైవర్ పారిపోయాడు.
అనంతరం నిందితుడు క్యాబ్ నుంచి దిగి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన స్థానికులు.. అతడిని పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని ప్రారంభించారు. నిందితుడిని స్టేషన్‌కు తరలించారు. బాధితురాలిని ఆస్పత్రిలో చేర్పించారు.
అయితే బాధితురాలిని రెండేళ్లుగా నిందితుడు వేధిస్తున్నట్లు ఆమె కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రేమను నిరాకరిస్తే చంపేస్తానని బెదిరించేవాడని చెబుతున్నారు. దీనిపై గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కుటుంబ సభ్యులు ఆరోపణలు చేశారు. బాధితురాలు, నిందితుడు కొన్నాళ్ల క్రితం.. ఒక కంపెనీలో పనిచేశారని చెప్పారు. బాలిక తండ్రి మరణించారని.. తల్లి, ఐదుగురు అక్కాచెల్లెళ్లను పోషించడానికి పనిచేస్తుందని స్థానికులు చెబుతున్నారు.
Boyfriend Kills Girlfriend Delhi : కొన్నాళ్ల క్రితం 16 ఏళ్ల బాలికను ఆమె బాయ్‌ఫ్రెండ్ అత్యంత దారుణంగా హత్య చేశాడు. రోడ్డుపైనే ఆమెను కత్తితో అనేకసార్లు పొడిచి, బండరాయితో కొట్టి చంపాడు. దిల్లీ షాబాద్ ప్రాంతంలో జరిగిందీ ఘోరం. హత్యకు గురైన బాలిక.. షాబాద్ డెయిరీ ప్రాంతంలోని జేజే కాలనీ వాసి. 20 ఏళ్ల సాహిల్, ఆమె కొంతకాలంగా రిలేషన్షిప్లో ఉన్నారు. కాగా వీరిద్దరికీ ఏదో విషయంలో గొడవ జరిగింది. అనంతరం ఆమె రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా సాహిల్ అడ్డగించాడు. బాలికను కత్తితో అనేకసార్లు పొడిచాడు. దగ్గర్లో ఉన్న బండరాయితో ఆమెను తీవ్రంగా కొట్టాడు. ఫలితంగా ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ దృశ్యాలన్నీ అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
యువతి ముఖంపై మద్యం సీసాతో దాడి.. తనకు దక్కంది ఎవరికీ దక్కకూడదని..
బ్రేకప్ చెప్పిందని కోపం.. పట్టపగలే ప్రియురాలిపై కత్తితో దాడి.. బాలికపై ఐదుగురు గ్యాంగ్ రేప్