ETV Bharat / bharat

తండ్రిపై కోపం చిన్నారికి శాపం.. హోంవర్క్​ చేసుకుంటున్న బాలికను కాల్చిచంపిన దుండగులు - బిహార్​లో బాలికపై కాల్పులు

ఇంట్లోకి చొరబడి బాలికపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు దుండగులు. ఈ ఘటనలో ఎనిమిదేళ్ల చిన్నారిని అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన బిహార్​లో​ జరిగింది. భూతగాదాలే ఘటనకు కారణంగా తెలుస్తోంది.

girl-shot-dead-in-bihar-due-to-land-dispute-bihar-firing
చిన్నారిని కాల్చి చంపిన దుండగులు
author img

By

Published : Mar 25, 2023, 4:44 PM IST

ఎనిమిదేళ్ల చిన్నారిని కాల్చి చంపారు దుండగులు. ఇంట్లోకి చొరబడి బాలికపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడ్డ చిన్నారి.. అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన బిహార్​లో​ని భోజ్​​పుర్​ జిల్లాలోని ఉద్వంత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. శుక్రవారం రాత్రి.. చిన్నారి ఇంట్లోకి చొరబడ్డ దుండగులు.. ఆమె తండ్రి గురించి ఆరా తీశారు. దానికి చిన్నారి సమాధానం చెప్పకపోవడం వల్ల ఆమెను కాల్చి చంపారు. భూతగాదాలే ఘటనకు కారణంగా తెలుస్తోంది. ఈ కాల్పుల్లో క్రిష్ణ సింగ్​ అనే వ్యక్తి కూతురు.. ఆరాధ్య మృతి చెందింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే అక్కడికి చేరుకున్నారు. చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. శవ పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
శుక్రవారం రాత్రి.. దాదాపు తొమ్మిది గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. అప్పటికే కృష్ణ సింగ్​ కుటుంబ సభ్యులు.. భోజనం చేసి పడుకున్నారు. కూతురు ఆరాధ్య మాత్రం హోంవర్క్​ చేసుకుటుంటోంది. అదే సమయంలో చిన్నారికి తలుపులు కొడుతున్న శబ్ధం వినిపించింది. దీంతో ఆరాధ్య వెళ్లి ఇంటి తలుపులు తీసింది. నలుగురు వ్యక్తులు ఆయుధాలతో ఇంట్లోకి చొరబడ్డారు. ఇది గమనించిన మిగతా కుటుంబ సభ్యులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారందరిని ఆ నలుగురు తుపాకులతో బెదిరించారు. అనతంరం చిన్నారికి తుపాకీ గురి పెట్టి.. తన తండ్రి కృష్ణ సింగ్ ఎక్కడ అని అడిగారు. దానికి బాలిక తనకు తెలియదని చెప్పింది. దీంతో చిన్నారిపై కాల్పులు జరిపిన దుండగులు.. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.

girl-shot-dead-in-bihar-due-to-land-dispute-bihar-firing
చిన్నారి

"కృష్ణ సింగ్​కు గ్రామంలోని మరో వ్యక్తితో ఆస్తి వివాదం నడుస్తోంది. మొత్తం 25 ఎకరాల భూమి విషయంలో వీరిద్దరికి వివాదం జరుగుతోంది. ఇదే వివాదంలో కొద్ది రోజుల క్రితం కృష్ణ సింగ్​ సోదరున్ని కూడా కాల్చి చంపారు దుండగులు. చిన్నారి హత్యకు కూడా ఈ వివాదమే కారణమని భావిస్తున్నాం." అని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని వారు వెల్లడించారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు.

కాల్పుల్లో ఆరేళ్ల చిన్నారి మృతి..
ఇదే తరహలో కొద్ది రోజుల క్రితం ఓ చిన్నారిపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆరేళ్ల చిన్నారి మృతి చెందింది. బైక్​పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు.. తండ్రి ఎదుటే కొడుకును కాల్చి చంపారు. పంజాబ్​లో ఈ దారుణ ఘటన జరిగింది. బాలుడి తండ్రిని చంపేందుకు వచ్చిన దుండుగులు.. గురితప్పి చిన్నారిని కాల్చి చంపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.