ETV Bharat / bharat

వదిన, మరదలి ప్రేమ.. పారిపోయి పెళ్లి.. రక్షణ కల్పించాలంటూ పోలీసుల వద్దకు..

వదినా మరదళ్లు ప్రేమించుకని ఇంట్లో నుంచి పారిపోయారు. అనంతరం ఏడు నెలల తరువాత తమకు రక్షణ కల్పించాలంటు పోలీసులను ఆశ్రయించారు. ఉత్తర్​ప్రదేశ్​లో సంభాల్​ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

girl-married-sister-sister-in-law-in-uttar-pradesh
యూపీ వదినను పళ్లి చేసుకున్న యువతి
author img

By

Published : May 15, 2023, 6:25 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లో ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. వరుసకు వదిన, మరదలు అయ్యే ఇద్దరు యువతులు కలిసి ఇంట్లో నుంచి పారిపోయారు. చాలా రోజులుగా ప్రేమలో ఉన్న వారిద్దరు.. ఏడు నెలల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. కుటుంబ సభ్యులు ఎంత వెతికిన ఆచూకీ లభించకుండా జాగ్రత్తపడ్డారు. కాగా ఆ ఇద్దరు తాజాగా తిరిగి వచ్చి.. రక్షణ కల్పించాలంటు స్థానిక పోలీసులను ఆశ్రయించారు. సంభాల్​ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బహ్​జోయ్ పోలీస్​ స్టేషన్​ పరిధిలో నివాసం ఉండే ఓ యువతి.. తన మరదలితో కలిసి నోయిడాలోని ఓ కంపెనీలు పని చేస్తుండేది. అదే సమయంలో వీరిద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. అనంతరం కొద్ది రోజులు పాటు లివ్ఇన్ రిలేషన్​షిప్​లోనూ ఉన్నారు. కాగా దాదాపు ఏడు నెలల క్రితం వారిద్దరు ఇంట్లో నుంచి పారిపోయారు. కుమార్తె కనిపించకపోయే సరికి.. ఆమె తండ్రి స్థానిక పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వారిద్దరిని వెతికే పనిలో పడ్డారు. కాగా కొద్ది రోజుల తరువాత ఆ యువతి తన మరదలితో కలిసి పారిపోయిందని కుటుంబ సభ్యులు తెలుసుకున్నారు. మొరాదాబాద్ జిల్లాలోని బిలారి పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటోందని సమాచారం అందుకున్నారు. వారి కోసం కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభినప్పటికీ.. ఎటువంటి ఆచూకీ లభించలేదు.

ఎట్టకేలకు ఆదివారం ఆ ఇద్దరు బహ్​జోయ్ స్టేషన్​కు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అందులో ఒక యువతి మగవారిలా డ్రెస్​ వేసుకుందని వెల్లడించారు. వారిద్దరూ పెళ్లి చేసుకున్నట్లు తమకు చెప్పారని పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల నుంచి రక్షణ కోసమే వారు తమను ఆశ్రయించినట్లు పోలీసులు వెల్లడించారు. చట్టం ప్రకారమే ఈ విషయంలో చర్యలు తీసుకుంటామని వారు వివరించారు. ప్రస్తుతానికి వారిద్దరిని ఎవరింటికి వారిని పంపించినట్లు బహ్​జోయ్ స్టేషన్​ ఇన్‌ఛార్జ్ పంకజ్ లావణియా తెలిపారు.

వింత.. అంజన్న సాక్షిగా ఇద్దరు అమ్మాయిల పెళ్లి..
కొంత కాలం క్రితం ఇదే ఉత్తరప్రదేశ్​లోని​ వారణాసిలో ఓ అరుదైన వివాహం జరిగింది. కాన్పుర్​కు చెందిన ఇద్దరు యువతులు వారణాసి హనుమాన్​ మందిరంలో వివాహం చేసుకున్నారు. అబ్బాయిలపై నమ్మకం లేకే ఇద్దరు అమ్మాయిలు పెళ్లి పీటలెక్కారు. కాన్పుర్​కు చెందిన ఇద్దరు అమ్మాయిలు కళాశాల రోజుల నుంచి స్నేహితులు. ఇద్దరు ఎప్పుడు కలిసే ఉండేవారు. హిందూ సంప్రదాయం ప్రకారం ఆలయ పూజారి, స్థానికులు వీరిద్దరికి పెళ్లి చేశారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.