ETV Bharat / bharat

బర్త్​డే పార్టీలో కాల్పులు.. బాలిక మృతి.. గ్యాంగ్​ రేప్​ చేసి ప్రైవేట్ భాగాలను సిగరెట్​తో కాల్చి.. - వివాహితపై గ్యాంగ్ రేప్

బర్త్​డే పార్టీలో విషాదం నెలకొంది. గుర్తు తెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో 12 ఏళ్ల బాలిక మృతి చెందింది. ఈ హృదయవిదారక ఘటన బిహార్​లో వెలుగుచూసింది. మరోవైపు, 42 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ముగ్గురు వ్యక్తులు. అనంతరం ఆమె ప్రైవేట్ భాగాలపై సిగరెట్​తో కాల్చారు. ఈ అమానవీయ ఘటన మహారాష్ట్రలో జరిగింది.

girl killed in firing during birthday
తుపాకీతో కాల్పులు
author img

By

Published : Dec 4, 2022, 4:46 PM IST

బిహార్ నలందాలో విషాదం నెలకొంది. బర్త్​డే పార్టీలో పాల్గొన్నవారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ కాల్పుల్లో బర్త్​డే పార్టీకి వెళ్లిన 12 ఏళ్ల బాలిక తీవ్రంగా గాయపడింది. హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే మృతి చెందింది. మృతురాలిని తుసీ కుమారిగా పోలీసులు గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
నలందా.. దీప్​నగర్​ పోలీస్ స్టేషన్ పరిధిలోని గంజ్​పుర్​లో ఓ చిన్నారి బర్త్​డే పార్టీ జరుగుతోంది. ​ఈ వేడుక సందర్భంగా బార్ గర్ల్స్ డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టారు. ఆ ప్రోగ్రాంను చూసేందుకు మృతురాలు అక్కడికి వెళ్లింది. పార్టీలో కొంతమంది యువకులు వేదికపైకి ఎక్కి బార్ గర్ల్స్‌తో కలిసి డ్యాన్స్ చేశారు. ఆ సమయంలో ఒక్కసారిగా కాల్పులు జరిపారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ కాల్పుల్లో బాలిక తలకి బులెట్ తగిలింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే మరణించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని.. మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుల కోసం గాలిస్తున్నామని.. త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

గ్యాంగ్​రేప్​.. ప్రైవేట్ భాగాలపై సిగరెట్​తో..
మహారాష్ట్ర ముంబయిలో దారుణం జరిగింది. 42 ఏళ్ల మహిళ ఇంట్లోకి ప్రవేశించి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ముగ్గురు కామాంధులు. అనంతరం బాధితురాలి ప్రైవేట్ భాగాలపై సిగరెట్​తో కాల్చారు. తర్వాత పదునైన ఆయుధంతో బాధితురాలి ఛాతీ, చేతులపై దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యారు. బుధవారం తెల్లవారుజామున జరిగిందీ ఘటన. బాధితురాలు, నిందితులు ఒకే ప్రాంతానికి చెందినవారని పోలీసులు తెలిపారు. ఈ దారుణాన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తామని నిందితులు బెదిరించారని పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.