ETV Bharat / bharat

12 మంది సీఎంల ఎదుటే నదిలో దూకిన యువతి - సరయూ నదిలో దూకిన యువతి

Girl Jumped In Saryu River: ఓ వైపు 12 రాష్ట్రాల ముఖ్యమంత్రులు నదిలో పూజలు చేస్తుండగా.. వారి ఎదుటే నీళ్లలోకి దూకింది ఓ యువతి. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని అయోధ్యలో జరిగింది.

girl jumped in saryu river
12 మంది సీఎంల ఎదుటే నదిలో దూకిన యువతి
author img

By

Published : Dec 15, 2021, 7:49 PM IST

12 మంది సీఎంల ఎదుటే నదిలో దూకిన యువతి

Girl Jumped In Saryu River: ఉత్తర్​ప్రదేశ్​ అయోధ్యలోని సరయూ నదిలో భాజపా పాలిత రాష్ట్రాలకు చెందిన 12 మంది సీఎంలు పూజలు చేస్తుండగా.. వారికి కొద్ది మీటర్ల దూరంలోనే ఓ యువతి వంతెన​పై నుంచి నీటిలోకి దూకింది. నదిలో ఉన్న నావికులు ఇది గమనించారు. వెంటనే సదరు యువతిని రక్షించి బయటకు తీసుకొచ్చారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఎస్​డీఆర్​ఎఫ్ బృందం ఘాట్​ వద్దకు చేరుకుంది. యువతిని స్థానిక ఆస్పత్రికి తరలించింది.

sdrf team
యువతికోసం గాలింపు చర్యలు

"నేను సరయూ నదిలో ఉండగా.. ఒక్కసారిగా శబ్దం వినిపించింది. ఎవరో మహిళ నదిలో దూకినట్లు గమనించాను. వెంటనే నా పడవలో వెళ్లి ఆమెను బయటకు తీసుకొచ్చాను. ఈలోపు ఎస్​డీఆర్​ బృందం సైతం ఘటనాస్థలికి వచ్చింది." అని యువతిని రక్షించిన నావికుడు అన్ను తెలిపాడు.

girl jumped in the river
యువతిని రక్షించి బయటకు తీసుకొస్తూ..
girl jumped in the river
యువతిని రక్షించిన నావికులు, ఎస్​డీఆర్​ఎఫ్ బృందం

యువతి బయటకు రాగానే ఆమె వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించామని పోలీసులు తెలిపారు. కానీ యువతి ఏ ప్రశ్నకూ స్పందించలేదన్నారు. ప్రస్తుతం ఆ యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని తెలిపారు.

భాజపా సీఎంల ప్రత్యేక పూజలు

nadda
అయోధ్య రామమందిరంలో నడ్డా పూజలు
BJP CM's In Ayodhya
అయోధ్యలో భాజపా సీఎంలు
BJP CM's In Ayodhya
భాజపా సీఎంల పూజలు

BJP CM's In Ayodhya: అంతకుముందు.. భాజపా పాలిత రాష్ట్రాలకు చెందిన 12 మంది ముఖ్యమంత్రులు.. వారి కుటుంబసభ్యులతో కలిసి అయోధ్యలోని సరయూ నది వద్దకు చేరుకున్నారు. నదిలో జలాభిషేకం నిర్వహించి, ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత అయోధ్య రాముడ్ని దర్శించుకున్నారు.

ఇదీ చూడండి: 'లఖింపుర్ ఖేరీ ఘటన కుట్రపూరితమే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.