పంజాబ్‌లోని జలంధర్‌లో ఘోర ప్రమాదం (Jalandhar accident news today) జరిగింది. ఫగ్వాడా నుంచి వస్తున్న ఓ వాహనం.. ధనోవాలి గేట్ వద్ద హైవే దాటుతున్న ఇద్దరు యువతులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ యువతి అక్కడికక్కడే మృతి చెందింది. మరో యువతికి తీవ్రగాయాలయ్యాయి. ఆమెను ఆస్పత్రికి తరలించారు. (Jalandhar accident news)
సోమవారం ఉదయం 8.30 గంటలకు ఘటన (Jalandhar accident today) జరిగింది. యువతులను ఢీకొట్టిన వాహనాన్ని ఓ పోలీస్ ఇన్స్పెక్టర్ నడుపుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత కూడా వాహనాన్ని ఆపలేదు. వాహనం వేగానికి.. ఢీకొట్టిన వెంటనే యువతి ఎగిరిపడింది. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.
నిరసన
యువతులు ఇద్దరూ సమీపంలోని ధనోవాలి గ్రామానికి చెందినవారని అధికారులు తెలిపారు. జలంధర్‌లోని ఓ కార్ షోరూంలో పనిచేస్తున్నారని చెప్పారు. ఘటన నేపథ్యంలో ధనోవాలిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీస్ ఇన్స్పెక్టర్ తీరుకు నిరసనగా మృతురాలి కుటుంబ సభ్యులు, స్థానికులు ఆందోళనకు దిగారు.
ఇదీ చదవండి: ఒకే పాముకు తోబుట్టువులు బలి.. రెండు రోజుల వ్యవధిలో...