ETV Bharat / bharat

మున్సిపల్​ ట్రక్కు బీభత్సం.. బాలిక బలి - బాలికను ఢీకొన్న మున్సిపాలిటీ ట్రక్కు

BBMP Garbage Truck Accident: కర్ణాటకలోని బెంగళూరులో మున్సిపాలిటీ ట్రక్కు బీభత్సం సృష్టించింది. అదుపు తప్పిన ట్రక్కు.. రోడ్డు దాటేందుకు ప్రయత్నించిన బాలికను ఢీకొంది. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.

BBMP Garbage Truck Accident
మున్సిపల్​ ట్రక్కు బీభత్సం
author img

By

Published : Mar 21, 2022, 6:59 PM IST

BBMP Garbage Truck Accident: రోడ్డు దాటేందుకు ప్రయత్నించిన ఓ బాలికను మున్సిపల్​ ట్రక్కు ఢీకొంది. ఈ ఘటనలో ఆమె అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో ఆదివారం రాత్రి జరిగింది.

BBMP Garbage Truck Accident
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన అక్షయ

తొమ్మిదో తరగతి చదువుతున్న 13 ఏళ్ల అక్షయ.. హెబ్బల్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని అండర్​ పాస్​ వద్ద రోడ్డు దాటేందుకు ప్రయత్నించింది. డివైడర్​ మీదగా రోడ్డు దాటాలని భావించింది. అయితే అదే సమయంలో వేగంగా దూసుకొస్తున్న బృహత్​ బెంగళూరు మహానగర పాలికేకు (బీబీఎంపీ) చెందిన ట్రక్కు బాలికను ఢీకొంది. దీంతో ఆమె అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. ట్రక్కు అదుపు తప్పడం వల్ల అక్కడే ఉన్న ఇతర వాహనాలు కూడా ప్రమాదానికి గురయ్యాయి. ఓ కారు, ద్విచక్రవాహనం ధ్వంసమయ్యాయి.

BBMP Garbage Truck Accident
ధ్వంసమైన కారు
BBMP Garbage Truck Accident
ట్రక్కు ధాటికి ప్రమాదానికి గురైన ద్విచక్రవాహనం

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆరుగురిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరారీలో ఉన్న డ్రైవర్​పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి : ఎమ్మెల్యేగా ఓడినా సీఎం ఆయనే.. పుష్కర్​ సింగ్​కే ఉత్తరాఖండ్​ పగ్గాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.